తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు కావాల్సిన మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తోంది. అయితే.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుతా ప్రభుత్వం పాఠశాలలను తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది అధికార యంత్రాంగం. అయితే.. ఈ నేపథ్యంలో రానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 10/10 జీపీఏ తీసుకువచ్చి విధంగా ఉత్తమ ఫలితాల కోసం కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అయితే.. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ తీసుకున్న నిర్ణయం వివాదస్పదంగా మారింది.
Also Read : NBK: ఇందుకే మా బాలయ్య బంగారం…
ప్రభుత్వ పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత రావాలని.. ఎక్కువ మంది విద్యార్థులకు 10/10 GPA రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే.. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులుతో మీటింగ్ పెట్టి షరతులు పెట్టారు కలెక్టర్ శరత్. అంతేకాకుండా.. స్కూల్ నుంచి ఎంత మంది విద్యార్థులతో 10/10 GPA తెప్పిస్తారో తెలపాలంటూ టీచర్లకు బాండ్ పేపర్లు ఇచ్చింది జిల్లా విద్యాశాఖ. బాండ్ పేపర్ లో ఇచ్చినంత మంది విద్యార్థులకు 10/10 GPA రాకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని బాండ్ సారాంశం. అయితే.. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ఉపాధ్యాయులు. ప్రైవేటు స్కూళ్లల్లోనే ఓవరాల్ గా 10/10 GPA ఎక్కడ రాలేదు అంటున్న టీచర్లు.. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామంటున్నారు.
Also Read : Jallikattu : జల్లికట్టు జోరు.. పోటీల్లో 60 మందికి గాయాలు