ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలెబ్రేటిల చిన్నప్పటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా చిన్నప్పటి ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
పైన ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్న పాప ఎవరు అనుకుంటున్నారా? ఈ అమ్మడు మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ తో చేసింది.. ఐడియా వచ్చిందా.. అవును మీరు గెస్ చేసింది అక్షరాల నిజం.. ఆమె ఎవరో కాదు సంయుక్త మీనన్.. ఫస్ట్ సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత వరుసగా విజయాలు నమోదు చేసింది. ఇంతకీ ఈ బ్యూటీ కేరళకు చెందనది. ఏమైనా ఐడియా వచ్చిందా. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది..
ఈ అమ్మడు తాజాగా తన చిన్నప్పటి ఫోటోను షేర్ చేసింది.. ఆ ఫోటోకు క్యాప్షన్ కూడా రాసింది.. చదువుతున్న రోజుల్లో సంయుక్త స్కూల్ టాపర్ అని చెప్పింది. ఇక విషయం తెలిసిన ఫ్యాన్స్ మా హీరోయిన్ మల్టీ టాలెంటెడ్ అని కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు.. మొత్తానికి ఆ ఫోటో మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు చివరగా డెవిల్ సినిమాలో నటించింది.. మలయాళం, తమిళ ఇండస్ట్రీలలో కూడా అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది..