తెలుగు స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పిన తక్కువే.. వరుస సక్సెస్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది.. ప్రస్తుతం ఈ బ్యూటీ సిటాడెల్ వెబ్ సిరీస్ తో బిజీగా గడుపుతుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం సెర్భియా లో షూటింగ్ జరుపుకుంటుంది. వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర లో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ విరామంలో చిత్ర యూనిట్ ఓ క్లబ్ కు వెళ్లి సందడి చేసింది..
ఆ క్లబ్ లో ఊ అంటావా మావా పాటను ప్లే చేశారు.. ఆ పాట వినగానే చుట్టూ ఉన్న వాటిని మర్చిపోయి మరీ డ్యాన్స్ వేసింది.. సామ్ పక్కనే ఉన్న హీరో వరుణ్ దావన్ కూడా సామ్ డ్యాన్స్ కు ఫిదా అయ్యాడు.. ఇంకా వెయ్యాలి అంటూ ఆమెను రెచ్చగొడుతున్నట్లు తెలుస్తుంది.. సామ్ క్లబ్ లో చిందులేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. ఇక సామ్ చేతిలో బీర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ వైరల్ అవ్వడం తో సమంత ఇలాంటి పనులు చేస్తుందా అంటూ షాక్ అవుతున్నారు..
ఇకపోతే రుస్సో బ్రదర్స్ రూపొందిస్తున్న ‘సిటాడెల్’ ఫ్రాంచైజీలో ఇది ఇండియన్ ఒరిజినల్ సిరీస్. హాలీవుడ్ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా నటించింది. ఇటీవలే ప్రైమ్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కు మంచి ఆధరణ వస్తుంది. కాగా, సిటాడెల్ నుంచి ఇప్పటికే విడుదలైన సామ్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. మోడరన్ లుక్ లో, స్టైలిష్ కాప్‌గా సామ్ అదిరిపోయింది.. ఈ సీరిస్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అలాగే తెలుగులో సామ్, విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమా చేస్తుంది.. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
Samantha item song craze is unbelievable 🥵🥵#SamanthaRuthPrabhu #Pushpa pic.twitter.com/BNZ2V6BOwj
— Actress Glam (@actressglam) June 10, 2023