Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమానికి జగన్ పిలుపు..

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అరాచక, మోసపూరిత పాలనకు జూన్ 4కు ఏడాది అవుతుందని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రశ్నించే గొంతులు లేవకుండా భయోత్పాతాన్ని సృష్టించిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఉండదన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది లోనే 95 శాతం హామీలు అమలు చేశారని కొనియాడారు. ఏడాదిలో ఎంత విధ్వంసం చేయాలో చంద్రబాబు చూపించారని ఎద్దేవా చేశారు.. అధికారం చేతిలో ఉంటే ఎన్ని దాడులు చేయొచ్చనేది చేసి చూపించారన్నారు.

READ MORE: CM Chandrababu: కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నాం..!

సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు పీ4 అంటున్నారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. ఎవర్నో తీసుకువస్తాను.. మీరు మీరు చూసుకోండి అంటున్నారని.. ఈ మధ్య మరీ బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. ఎవరూ ప్రశ్నించకుండా హింసాకాండ క్రియేట్ చేస్తున్నారన్నారు.. గతంలో మామకు వెన్నుపోటు పొడిచారు.. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ పొడుస్తున్నారని విమర్శించారు.. వెన్నుపోటుకు పేటెంట్ అంటే చంద్రబాబే గుర్తుకు వస్తారన్నారు.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబు పాలనకు నిరసనగా జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమానికి జగన్ పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రతీ జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు..

READ MORE: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌ “ఘన విజయం”.. అమెరికా సైనిక నిపుణుడు..

Exit mobile version