ఎన్నికల ముందు 143 వాగ్దానాలతో పాటు ఈవీఎంలను లోబర్చుకుని చంద్రబాబు గెలిచారని, గెలిచి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ ఆరోపించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం రోజు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు పైకి వచ్చారని చెప్పారు. ప్రతి కార్యక్రమంలో జగన్‌ని నిందిస్తున్నారని.. అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని.. దిగజారుడు మాటలు మాట్లాడటానికి సిగ్గు అనిపించడం…
వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరు లోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు పాలన ఏడాది వైఫల్యాలు, వైఎస్ జగన్ తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యం చేసిన విధానంపై వివిధ రంగాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు…
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని.. అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్బుతమైన స్పందన లభించిందన్నారు.
వెన్నుపోటు దినోత్సవం కేవలం పనిలేక చేసినట్టు ఉందని.. కూటమి ప్రభుత్వం లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసిందన్నారు. ఏడాది కాలంలో పెన్షన్, అన్నక్యాటీన్, ఉచిత గ్యాస్ సిలిండర్, యువతకి డీఎస్సీ వంటి కార్యక్రమాలు చేసిందన్నారు. కేంద్రప్రభుత్వం సహకారంతో అమరావతి, పోలవరం, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి అసలు జరగవు అనుకున్న కార్యక్రమాలు చేసి చూపించామని తెలిపారు. ప్రతిపక్షానికి ఆనాడే…
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అరాచక, మోసపూరిత పాలనకు జూన్ 4కు ఏడాది అవుతుందని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రశ్నించే గొంతులు లేవకుండా భయోత్పాతాన్ని సృష్టించిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఉండదన్నారు.