రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అరాచక, మోసపూరిత పాలనకు జూన్ 4కు ఏడాది అవుతుందని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రశ్నించే గొంతులు లేవకుండా భయోత్పాతాన్ని సృష్టించిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఉండదన్నారు.