Early Elections in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై ఎప్పటి నుంచో చర్చ సాగుతోంది.. అయితే, తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హస్తినలో పర్యటించారు.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో సమావేశమై.. పలు అంశాలపై చర్చించారు.. కానీ, ఇదే సమయంలో మరోసారి ముందస్తు ఎన్నికలపై ప్రచారం ఊపందుకుంది.. ముందస్తు కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో మొదలైంది.. దీనిపై ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు.. ముందస్తు ఎన్నికలు అన్నది మీడియా చేస్తున్న హడావిడి, కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారం మాత్రమేనన్న ఆయన.. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదన్నారు.. ఇప్పటికే చాలా సార్లు చెప్పాం.. ప్రజా తీర్పు ప్రకారం చివరి రోజు వరకు పాలన ఉంటుందని తేల్చేశారు.
Read Also: Kishan Reddy : కుటుంబ పాలన, అవినీతిపై మోడీ పోరాటం చేస్తున్నారు
ముందస్తు చంద్రబాబు చేస్తున్న గేమ్ ప్లాన్ లా ఉందని విమర్శించారు సజ్జల.. చంద్రబాబు తల కింద తపస్సు కూడా చేసుకోవచ్చు.. ఇద్దరే మాట్లాడుకునే విషయాలను వీరే ఊహించుకుని రాస్తారు.. సోఫాల కింద ఉంటారా? అంటూ సెటైర్లు వేశారు. సీఎం వైఎస్ జగన్.. ఢిల్లీ వెళ్ళిన ప్రతీసారీ ఫలితాలను రాష్ట్రం చూస్తూనే ఉందన్న ఆయన.. ఈ సారి మా ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు రానుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పాజిటివ్ ఓటుతోనే గెలవాలని సీఎం కోరుకుంటున్నారని వెల్లడించారు. ఆర్ 5 జోన్ లో కొన్ని సంపన్న, కులీన వర్గాలే పేదలకు ఇళ్ళు రావద్దు అని కోరుకుంటున్నారని ఆరోపించారు.. కేంద్రం నుండి ఇళ్ళ నిర్మాణానికి నిధులు రావటం జాప్యం అయినా.. రాష్ట్ర వాటా నుంచి పనులు ప్రారంభం అవుతాయన్న ఆయన.. పేదలకు ఇళ్లు ఇస్తాం అంటే కోర్టులు మాత్రం ఎందుకు కాదంటాయి? అని ప్రశ్నించారు. మరోవైపు, షర్మిల ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆమె నిర్ణయాలు ఆమెకు ఉంటాయి.. వైసీపీగా మా విధానాలు మాకు ఉంటాయని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.