Sajjala Ramakrishna Reddy: పవన్ రాజకీయ నాయకుడే కాదు.. కులంపైనే యాత్ర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: వారాహి యాత్రలో ప్రభుత్వంపై విరుచుకుపడుతోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. పవన్ కల్యాణ్ సినీ నటుడు.. అసలు రాజకీయ నాయకుడే కాదు అంటున్నారు.. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో ఎక్కడా లేనంత అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతోందన్నారు.. జగనన్న సురక్ష కార్యక్రమం కింద గవర్నెన్స్ ను ప్రజలకు మరింతగా తీసుకుని వెళ్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. అర్హులై ఉండి ప్రభుత్వ పథకాలు అందని లబ్ధిదారులకు కూడా పథకాలు అందించే ప్రయత్నం చేస్తున్నామన్న ఆయన.. టీడీపీకి ఎప్పుడూ ఇలాంటి ఆలోచనే చేయలేదని విమర్శించారు.. చిత్తశుద్ధితో ఉండటం వల్లే ఇలాంటి ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఈ కార్యక్రమమే చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు మింగుడు పడడంలేదన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ఆస్వాదిస్తున్నారని తెలిపారు.
పవన్ కల్యాణ్ సినిమా నటుడు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతుంటాడు అంటూ సెటైర్లు వేశారు సజ్జల.. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటం కోసమే పని చేస్తున్నాడనేది పవన్ మాటలను బట్టి అర్థం అవుతోందన్న ఆయన.. టీడీపీ, పవన్ కల్యాణ్.. వాళ్ల మీడియా అజెండా అంతా ఒకే చోట తయారు అవుతుందని విమర్శించారు.. ఒక స్కీం ప్రకారం ఇది జరుగుతోంది.. వ్యక్తిగత సంఘటనలు జరుగుతాయి.. తన హయాంలో దాడులు జరిగినప్పుడు ప్రతి వ్యక్తి దగ్గర ఒక పోలీసును పెట్టలేను అని చంద్రబాబు చెప్పలేదా? అని ప్రశ్నించారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించటానికి చిత్తశుద్ధితో పని చేస్తున్న ప్రభుత్వం మాదన్న ఆయన.. విశాఖ ఎంపీ ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాను కనుక వ్యాపారాలు వేరే రాష్ట్రంలో చేస్తాను అని అన్నారు.. కానీ, ఈ వ్యాఖ్యలను దిగజారి రూపం మార్చారని ఫైర్ అయ్యారు.
Also Read
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
ఇక, టీడీపీ బస్సు యాత్రలో నాయకులు ఎవరూ ఉండటం లేదని ఎద్దేవా చేశారు సజ్జల.. మినీ మేనిఫెస్టోతో చంద్రబాబు నవ్వుల పాలయ్యాడన్న ఆయన.. చంద్రబాబు మేనిఫెస్టో అనే మాట మాట్లాడకపోతేనే నయం అన్నారు. కులాల మధ్య చిచ్చు పెడితే వాళ్లకే బూమ్ ర్యాంగ్ అవుతుందన్నారు.. చరిత్రలో ఈ విషయం స్పష్టం అయ్యిందన్నారు.. అయితే, పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కులం అంశంపై నే చేస్తున్నారని స్పష్టం అవుతుందని ఆరోపించారు.. ముద్రగడ పద్మనాభం తన కులం కోసం గట్టిగా నిలబడిన వ్యక్తి.. ఆ కృషిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్న ఆయన.. ముద్రగడ నిజాయితీ గల వ్యక్తి.. మా పార్టీ విధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం అన్నారు. కానీ, ముద్రగడను ఎవరైనా కంట్రోల్ చేయగలరు అనుకోవటం అమాయకత్వం అవుతుందన్నారు.. మరోవైపు.. ఎన్నికలు దగ్గర పడుతుండటంతోనే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారంటూ.. ఏపీ, తెలంగాణలో భూముల ధరలపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!