Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు విజన్ 2047 ఒక దుస్సాహసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు విజన్ 2047 ఒక దుస్సాహసమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. జనం అంటే ఏమీ తెలియని అమాయకులు, పిచ్చోళ్ళని చంద్రబాబు నమ్మకమంటూ ఆయన ఎద్దేవా చేశారు. వందేళ్ళ వయసులో కూడా పాలన చేస్తానని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నారన్నారు. చంద్రబాబు ఒక రాజకీయ నాయకుడు అని.. తన విధానం ఏంటో, తాను వస్తే ఏం చేస్తాడో చెప్పాలని ఆయన పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటూ సజ్జల ప్రశ్నించారు. పైకి పోయినా తానే శాశ్వతంగా పాలిస్తాను అనుకుంటున్నారని.. ప్రజలంటే అపహాస్యం, చులకన భావం దీనిలో వ్యక్తం అవుతుందన్నారు.
Also Read: Ghost : 16 సార్లు కత్తితో పొడిచిన బాయ్ ఫ్రెండ్.. వచ్చి కాపాడిన దెయ్యం.. ఇంట్రెస్టింగ్ స్టోరీ
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
గత ఐదేళ్లలో ఇప్పుడు చెప్పిన అంశాల్లో ఒకటైనా చేశాడా అంటూ ఆయన ప్రశ్నించారు. నిన్న ఏం చేశారో, ఇవాళ ఏం చేశారో.. పిచ్చి స్థాయి దాటి ఒక ట్రాన్స్‌లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఒక తిక్కమేళమని.. తలా తోక లేని ఆలోచనలు చేస్తుంటాడని ఆరోపించారు. సినిమాల్లో ఇలాంటివి చూపిస్తారన్నారు. ఎన్నికలే ప్రజా కోర్టు అని.. ఎవరి చెవిలో పూలు పెడుతున్నారని ప్రశ్నించారు. సినిమాలు లేనప్పుడు యూట్యూబ్‌లో ప్రజా కోర్టు పెడతాడేమో అంటూ ఎద్దేవా చేశారు.తెలుగు, హిందీలో కూడా ఇలాంటి సీరియల్స్ వచ్చాయన్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావటానికే అవకాశం లేదన్నారు.ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో తెలియదని.. ఇక అధికారంలోకి ఎలా వస్తాడంటూ సజ్జల పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వీరే అన్నారని.. ఇప్పుడు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాం అనటం ప్రజల్ని మభ్యపెట్టడమేనని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!