Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polavaram Weather Attracts Tourists: పోలవరం ఏజెన్సీ ప్రాంతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఎటు చూసినా తెల్లటి పొగమంచు పరుచుకుని ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. కొండలు, గుట్టలు, పచ్చని అడవుల మధ్య మంచు తెరలు కనువిందు చేస్తున్నాయి. చల్లని గాలులు.. మబ్బులతో నిండిన కొండలు.. మంచు తెరల మధ్య నుంచి తొంగిచూస్తున్న సూర్యకిరణాలు ప్రకృతి ప్రేమికులను మైమరిపిస్తున్నాయి. దీంతో మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్లకు విహారయాత్రికుల తాకిడి పెరుగుతోంది.
పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గత వారం రోజులుగా చలి తీవ్రత పెరిగింది. తెల్లవారుజామున నుంచి ఉదయం 9 గంటల వరకు అనేక గ్రామాలను దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. కొండలు, గుట్టలు, లోయలు, పచ్చని అటవీ ప్రాంతాలు మంచు తెరల మధ్య కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి ఒడిలోని గిరిజన గ్రామాలు మంచు అందాలతో కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. మరోవైపు మంచు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్లకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.
Also Read
- U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్‌ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
- 200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
- Koti Deepotsavam Day 2: కోటి దీపోత్సవం రెండో రోజు విశేష పూజలు.. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
- AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం!
ఘాట్ రోడ్డులోని వ్యూ పాయింట్ల నుంచి మంచు తెరల మధ్య కనిపించే కొండలు, లోయల అందాలను వీక్షిస్తూ పర్యాటకులు మైమరచిపోతున్నారు. చల్లని గాలులు, పొగమంచు మధ్య ప్రకృతి అందాలను తమ సెల్ఫోన్లలో బంధిస్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున మంచు తెరల మధ్య నుంచి సూర్యకిరణాలు ప్రసరించే దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా శీతాకాలం ఆరంభంలోనే పోలవరం ఏజెన్సీ ప్రాంతం ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా మారి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
తాజావార్తలు
-
Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
-
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
-
U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్‌ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
-
Manal Chauhan: లెక్కలేసుకుని ఆడాను.. కానీ భారత్‌ను గెలిపించలేకపోయా.. మనాల్ ఎమోషనల్ కామెంట్స్!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?