Artist Srinivasan Dies: శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసిన తొలి చిత్రకారుడు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Artist Srinivasan Dies at 86: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూశారు. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టికి చెందిన ఆయన.. వయోభారంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. శ్రీనివాసన్ గీసిన శ్రీవేంకటాచలపతి చిత్రం దశాబ్దాలుగా భక్తుల ఇళ్లలో, దుకాణాల్లో, క్యాలెండర్లలో కనిపిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది.
1970లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు శ్రీవేంకటేశ్వర స్వామి మూలవిరాట్టు చిత్రాన్ని గీయించేందుకు ఆసక్తి ఉన్న చిత్రకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందుకోసం ఒక వార్తాపత్రికలో ప్రకటన ఇచ్చారు. ప్రముఖ చిత్రకారుడు ఓవిమామణి కొండైరాజు వద్ద చిత్రకళను అభ్యసించిన శ్రీనివాసన్ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన ప్రతిభను పరిగణనలోకి తీసుకున్న టీటీడీ అధికారులు తిరుమలకు రావాలని ఆహ్వానిస్తూ లేఖ పంపించారు. అయితే ఆ సమయంలో శ్రీనివాసన్‌కు అనూహ్యంగా తట్టు వ్యాధి సోకడంతో టీటీడీ నిర్ణయించిన తేదీకి తిరుపతికి వెళ్లలేకపోయారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత దేవస్థానం పంపిన లేఖతో తిరుమలకు చేరుకున్న ఆయన.. తనకు ఎదురైన అనారోగ్య సమస్యలను అధికారులకు వివరించారు. గర్భగుడి సమీపంలో కూర్చొని స్వామివారి చిత్రాన్ని గీసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకోసం కొంతకాలం ప్రయత్నించిన అనంతరం ఆయనకు టీటీడీ నుంచి అనుమతి లభించింది.
Also Read
- Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
- U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్‌ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
- 200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
- Koti Deepotsavam Day 2: కోటి దీపోత్సవం రెండో రోజు విశేష పూజలు.. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
శ్రీనివాసన్‌కు స్వామివారి మూలవిరాట్టుతో పాటు ఆభరణాలను చిత్రించే అవకాశం కల్పించారు. ఆభరణాలతో అలంకరించిన రూపంతో పాటు, ఆభరణాలు లేని స్వామివారి రూపాన్ని కూడా చిత్రించేందుకు అరరోజు సమయం కేటాయించినట్లు సమాచారం. గర్భగుడి సమీపంలో కూర్చొని స్వామివారి రూపాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఆయన ఈ చిత్రాలను రూపొందించారు. కొండైరాజు గురుకులంలో శిక్షణ పొందిన ప్రతి శిష్యుడికీ తనదైన ప్రత్యేక చిత్రకళా శైలి ఉండేది. ఆ చిత్రకళా సంప్రదాయానికి చెందిన శ్రీనివాసన్ తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన గీసిన తిరుమల శ్రీవేంకటాచలపతి చిత్రం విశేషంగా ప్రాచుర్యం పొందింది.
శ్రీనివాసన్ రూపొందించిన ఈ చిత్రాన్ని శివకాశికి చెందిన ప్రింటర్స్ ముద్రించి విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. అనంతరం క్యాలెండర్ల రూపంలోనూ అందుబాటులోకి వచ్చింది. అలా ఆయన గీసిన స్వామివారి చిత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక ఇళ్లలో, దుకాణాల్లో భక్తుల పూజా మందిరాల్లో కనిపించే ప్రసిద్ధ చిత్రంగా మారింది. శ్రీవేంకటేశ్వర స్వామి రూపాన్ని తన కుంచెతో అద్భుతంగా ఆవిష్కరించి లక్షలాది మంది భక్తుల హృదయాల్లో స్థానం సంపాదించిన శ్రీనివాసన్ మరణంతో చిత్రకళా రంగంలో విషాదం నెలకొంది. ఆయన గీసిన స్వామివారి చిత్రం మాత్రం భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోనుంది.
తాజావార్తలు
-
Artist Srinivasan Dies: శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసిన తొలి చిత్రకారుడు మృతి!
-
Shubhanshu Shukla: 2040 నాటికి చంద్రుడిపై భారత జెండా.. ఇదే నా అసలైన లక్ష్యం: వ్యోమగామి శుభాంశు శుక్లా
-
Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
-
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
-
U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్‌ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
ట్రెండింగ్
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!