Sabitha Indra Reddy : హైడ్రాపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైడ్రా పై మాజీ మంత్రి సబితా ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఒక పబ్లిసిటీ స్టంట్. మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేయడం తప్పా హైడ్రాకు ఏమి పని లేదంటూ తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మణికొండ అల్కపూర్ టౌన్ షిఫ్ సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సబితా, ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్క్ తొలగించడానికి హైడ్రాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని ఆమె విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా గత 8 నెలలుగా కేసీఆర్ పై అన్ని విధాలుగా బురదజల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినా కేసీఆర్ మార్క్ మాత్రం చేరిపి వేయడంలో విఫలమయ్యారని ఆమె వ్యాఖ్యానించారు.
Ap Floods : 3 రోజుల్లో 60 వేల మందికి రేషన్ పంపిణీ.. 42 డ్రోన్ల సహాయంతో లక్ష మందికి పైగా ఫుడ్
Also Read
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
కొత్తగా హైడ్రాను రంగంలో దించి సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని, ఔటర్ రింగు రోడ్డు చుట్టూ 30వేల ఎకరాలలో 4 లక్షల నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అందులో 10% శాతం కూల్చివేసినా గొప్ప విషయమే అని ఆమె అన్నారు. రోజుకు నాలుగు దిక్కుల హైడ్రా కూల్చివేతలు చేపడుతుంది. దానికి ఒక ప్రణాళిక లేదు. ఏ ఒక్క చెరువును సరియైన పద్దతిలో కాపాడింది లేదని, సామాన్యుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వంకు తాకుతుందన్నారు. గత 30 సంవత్సరాల క్రితం పైసా పైసా కూడబెట్టుకొని నిర్మాణాలు చేసుకుంటే ఈ రోజు వచ్చి మీ నిర్మాణాలు అక్రమం అంటూ కూల్చివేతలు చేపడితే గుండె పోటు వచ్చి చనిపోతారని, ఈ పాపం ఎవరిదో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని ఆమె అన్నారు. హైడ్రా ఒక డ్రామా, ఆ డ్రామా గుట్టును త్వరలోనే రట్టు చేస్తాం అని ఆమె అన్నారు.
Traffic Constable: విషాదం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య..
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!