Ap Floods : 3 రోజుల్లో 60 వేల మందికి రేషన్ పంపిణీ.. 42 డ్రోన్ల సహాయంతో లక్ష మందికి పైగా ఫుడ్
- ఈ మూడు రోజుల్లో 60 వేల మందికి పైగా రేషన్ పంపిణీ
- ఫైర్ ఇంజన్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన ఇళ్లను శుభ్రం
- ఇప్పటికే 20 వేల ఇళ్లకు పైగా శుభ్రం
- రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మూడు రోజుల్లో 60 వేల మందికి పైగా రేషన్ పంపిణీ జరిగిందని.. రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఫైర్ ఇంజన్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన ఇళ్లను శుభ్రం చేసే కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇప్పటికే 20 వేల ఇళ్లకు పైగా శుభ్రం చేయడం జరిగిందని చెప్పారు. ఆదివారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ.. 42 డ్రోన్ల సహాయంతో క్లోరినేషన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. వీటి సాయంతో లక్ష మందికి పైగా ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశామన్నారు. గత ముఖ్యమంత్రులు వరద ప్రాంతాల్లో ఒక్కరోజు మాత్రమే పర్యటించి వెళ్ళిపోయేవారని విమర్శించారు. సీఎం చంద్రబాబు హ్యుమానిటీ యాంగిల్ లో కూడా ఆలోచించి పరిస్థితులన్నింటినీ పర్యవేక్షిస్తున్నారని కొనియాడారు.
READ MORE: Trinamool Congress: టీఎంసీ ఎంపీ రాజీనామా.. మమతా బెనర్జీ తీరుని సహించలేకే..
Also Read
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
- Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్‌లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
కుటుంబాన్ని, పండుగలను కూడా పక్కనపెట్టి సీఎం చంద్రబాబు ప్రజల కోసమే ఆలోచన చేస్తున్నారని మంత్రి అనిత తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో ఉండి అంతా పర్యవేక్షిస్తున్నారన్నారు. చిన్నపిల్లలు కూడా వారి కిడ్డీ బ్యాంకుల్లో డబ్బులు తీసి విరాళాలు ఇస్తున్నారని.. కానీ గత ప్రభుత్వ నాయకులు బెంగళూరులో కూర్చుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో 8 రోజులుగా వరద ప్రభావం ఉంటే గత ప్రభుత్వ నాయకుడు వచ్చి ఇక్కడ 20 నిమిషాలు మాత్రమే ఉన్నారని విమర్శించారు. మంత్రి నిమ్మల రామానాయుడు నిద్రాహారాలు మాని 3 రోజులుగా బుడమేరు దగ్గరే ఉండి అంతా సమీక్షించారని తెలిపారు. ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం వైపే ఉన్నారన్నారు. గణేష్ మండపాలకు సంబంధించిన జీవోపై మంత్రి స్పందించారు. 2022లోనే గత ప్రభుత్వం గణేష్ మండపాలకు సంబంధించి జీవో ఇచ్చింది.. తాము ఆ జీవోలో ఉన్న దానిని చెప్పామని స్పష్టం చేశారు. కానీ, సింగిల్ విండో విధానంలోనే గణేష్ మండపాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని.. గత ప్రభుత్వ జీవోలో ఉన్న అంశాలను సీఎం దృష్టికి కూడా తీసుకొచ్చామన్నారు.
READ MORE:Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు
ఎలాంటి డబ్బులు వసూలు చేయకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. సీఎం ఆదేశాలను మేము 10 రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించామని మంత్రి గుర్తు చేశారు. గణేష్ మండపాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదన్నారు. మైక్ పర్మిషన్ కు కూడా డబ్బులు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లకు సంబంధించి సమగ్ర విచారణ జరుగుతోందని తెలిపారు.
తాజావార్తలు
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!