Traffic Constable: రైలు కింద పడి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఘట్‌కేసర్‌లో చోటుచేసుకుంది. నగరంలోని ట్రాఫిక్ పీఎస్ సికింద్రాబాద్ గోపాలపురంలో నరసింహారాజు ట్రాఫిక్ కానిస్టేబుల్ పీసీ 9782 (2009 బ్యాచ్) విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఘట్‌కేసర్‌లోని ఫోల్‌నెం.216 వద్ద నరసింహారాజు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలం నుంచి నర్సింహరాజు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Read also: Harish Rao: అక్కడ ఒక రూల్.. తెలంగాణ లో మరో రూలా ?
ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ నరసింహారాజు అంబర్పేట్ లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నర్సింహరాజు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పండుగ మరుసటి రోజే నరసింహారాజు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న అందరితోను బాగానే ఉన్నాడని తెలిపారు. విధులకు వెలుతున్నట్లు తెలిపిన కానిస్టేబుల్ ఇవాళ ఉదయం విగతజీవిగా మిగిలాడని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.
Khairatabad Ganesh 2024: గంట గంటకూ పెరుగుతున్న ఖైరతాబాద్ గణేష్ భక్తుల రద్దీ..