IND vs SA: టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్.. ఉన్నపలంగా స్వదేశానికి స్టార్ ప్లేయర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan Withdraws From India’s Test Squad vs South Africa: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియాకు టెస్టు సిరీస్‌కు ఆరంభానికి ముందే షాకులు తగులున్నాయి. ఇప్పటికే సీనియర్ పేసర్ మహ్మద్ షమీ చీలమండ గాయం కారణంగా టెస్టు జట్టు నుంచి తప్పుకోగా.. తాజాగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఇషాన్ ఉన్నపలంగా భారత్ బయల్దేరాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇషాన్ స్థానాన్ని ఆంధ్రా కుర్రాడు కేఎస్ భరత్ భర్తీ చేస్తాడని బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే ఉన్న భరత్.. త్వరలోనే భారత టెస్ట్ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ తెలిపింది.
ఇషాన్ కిషన్ టెస్టు జట్టు నుంచి రిలీజ్ కావడానికి వ్యక్తిగత కారణాలు అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. టెస్ట్ సిరీస్ నుంచి విడుదల చేయాలని ఇషానే స్వయంగా కోరినట్టు బీసీసీఐ తెలిపింది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20, టెస్ట్ సిరీస్‌ల కోసం ఇషాన్ ఎంపికయ్యాడు. టీ20ల్లో ఒక్క అవకాశం రాకపోవడంతో.. టెస్ట్ సిరీస్‌పై ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఉన్నపళంగా ఇషాన్ ఇంటి వెళ్లిపోవడంతో.. ఇండియా–ఏ టీమ్‌తో దక్షిణాఫ్రికాలోనే ఉన్న కేఎస్ భరత్‌కు అనూహ్యంగా సెలెక్టర్ల నుంచి పిలుపు అందింది. కేఎల్ రాహుల్ తర్వాత రెండో వికెట్‌కీపర్ ఛాయిస్‌గా భరత్ ఉంటాడు. డిసెంబర్ 26 నుంచి టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది.
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
- Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
Also Read: Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం ప్రారంభం.. ఒకే గొడుగు కిందకు డైమండ్ ట్రేడింగ్!
టెస్టుల కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (కీపర్).
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!