AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ నష్టాన్ని మిగిలిచ్చింది.. అయితే, అర్నబ్ తుఫాన్ ప్రభావం, తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రేపు అత్యవసరంగా సమావేశం కానుంది. తుఫాన్ పరిస్థితులు, ప్రభావిత జిల్లాల్లో జరిగిన నష్టం, ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులపై ఏపీ కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. బాధితులకు అందిస్తున్న సహాయక చర్యలు, పునరుద్ధరణ పనుల పురోగతిపై కూడా సమీక్షించే అవకాశం ఉంది. మరోవైపు, అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రాంతాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు. బాధితులను పరామర్శించి, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది.
కాగా, అర్నబ్ తుఫాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామని ఇప్పటికే ప్రకటించారు సీఎం చంద్రబాబు.. ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు రూ.10 వేల ఆర్థిక సాయం, కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు దెబ్బతిన్న వారికి రూ.25 వేల చొప్పున సాయం అందిస్తామని వెల్లడించారు. తుపాను ప్రభావిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇక, తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై రేపు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చంద్రబాబు తెలిపారు. నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందాన్ని పంపించాలని కోరనున్నట్లు వెల్లడించారు. పంటలు, పశువులు, మత్స్య సంపద, ఇతర రంగాల్లో నష్టపోయిన వారందరికీ పారదర్శకంగా పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. ఇక, తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ పంటలకు పరిహారం ప్రకటించారు.. పత్తి, గోధుమ, చెరకు పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున అందించనున్నారు. వరి పంటకు ఎకరాకు రూ.20 వేల సాయం ప్రకటించారు. సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు తదితర పంటలకు ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం అందించనున్నారు. ఇక, అరటి, పసుపు, మామిడి, జీడిమామిడి, కాఫీ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటలకు ఎకరాకు రూ.35 వేల పరిహారం ప్రకటించారు. కూరగాయలు, బొప్పాయి, టమాట, పైనాపిల్ వంటి పంటలకు ఎకరాకు రూ.25 వేల సాయం అందించనున్నారు. తమలపాకు తోటలకు ఎకరాకు రూ.75 వేల పరిహారం ఇవ్వనున్నారు. కొబ్బరి, ఆయిల్ పామ్ చెట్లు దెబ్బతింటే ఒక్కో చెట్టుకు రూ.15 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం..
Also Read
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. ఏకగ్రీవాలే లక్ష్యం.. మంత్రులకు కీలక ఆదేశాలు
- Deputy CM Pawan Kalyan: రామాంజులు మృతిపై పవన్ ఆరా.. నాగులగుట్టపల్లి ఘటనపై కీలక ఆదేశాలు..
- CM Chandrababu: కూటమి ధర్మం పాటించాం.. సీట్లు రాలేదని అలగడం ఏంటి..? బీజేపీపై చంద్రబాబు అసహనం..
- CM Chandrababu: ఓటుకు నోటు వద్దు.. మంచి నాయకుడిని ఎన్నుకోండి.. ప్రజలకు చంద్రబాబు పిలుపు
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!