Arshdeep Singh Said I would thank KL Rahul: తాను చాలా రోజుల తర్వాత వన్డే క్రికెట్ ఆడుతున్నా కాబట్టి ఇబ్బంది పడతానేమోనని అనిపించినా త్వరగానే కుదురుకున్నా అని టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. వికెట్ టు వికెట్ బంతులు బౌలింగ్ వేయడంతో వికెట్లు దక్కాయన్నాడు. తనకు అవకాశం ఇచిన కెప్టెన్ లోకేష్ రాహుల్ కి కృతజ్ఞతలు చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ (5/37) ఐదు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్ల కోటాలో 37 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్ సింగ్ మాట్లాడుతూ… ‘నాకు కొంచెం నొప్పిగా ఉంది. కానీ ఈ క్షణాన్ని బాగా ఆస్వాదిస్తున్నా. ఆ దేవుడికి మరియు టీమ్ మేనేజ్‌మెంట్‌కి ధన్యవాదాలు. ఇది సాధారణ మైదానాల కంటే కొంచెం భిన్నంగా ఉంది. నా బౌలింగ్ పట్ల సంతోషంగా ఉన్నా. వ్యక్తిగతంగా నా పాత్రను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ అవకాశం (సుదీర్ఘ స్పెల్) ఇచ్చి ఐదు వికెట్లు తీయగలవని ఎంకరేజ్ చేసిన రాహుల్ భాయ్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏమీ ఆలోచించకుండా ఈ క్షణాన్ని ఆస్వాదించాలని నేను అనుకుంటున్నాను. ఇక రాబోయే మ్యాచ్‌లపై దృష్టి పెట్టాలి’ అని తెలిపాడు.
Also Read: Parliament Security Breach: పార్లమెంట్ ఘటనపై ప్రధాని ముఖం చాటేస్తున్నారు.. చర్చ అవసరమే!
‘వన్డేల్లో ఇప్పటివరకు గొప్ప గణాంకాలు నమోదు చేయలేదు. ఈసారి అద్భుతమైన ఆరంభం దక్కింది. పిచ్ నుంచి సహకారం దొరికింది. మ్యాచ్‌కు ముందు పిచ్ గురించి మాట్లాడుకున్నప్పుడు పెద్దగా మూమెంట్ ఉండదనుకున్నాం. అనూహ్యంగా బంతి స్వింగ్‌కు అనుకూలంగా మారింది. వికెట్ టు వికెట్ బంతులను సంధిస్తే చాలనుకున్నాం. అలాగే బౌలింగ్ చేయడంతో వికెట్లు దక్కాయి. చాలా రోజుల తర్వాత 50 ఓవర్ల క్రికెట్ ఆడా. ఇబ్బంది పడతానేమోనని అనిపించినా త్వరగానే కుదురుకున్నా. 5 వికెట్ల ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది’ అని అర్ష్‌దీప్ సింగ్ పేర్కొన్నాడు.