Luna-25: చంద్రయాన్-3, అంతరిక్ష రంగంలో భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించింది. ఎవరికి సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్‌ని విజయవంతంగా దించింది. చంద్రుడిపై ఇలా ల్యాండర్, రోవర్లని దించిన నాలుగో దేశంగా, దక్షిణ ధృవంపై దిగిన మొదటి దేశంగా కీర్తిగడించింది. అంతకుముందు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై ల్యాండర్లను దించాయి.
NASA: దాదాపుగా 40 ఏళ్ల తరువాత రష్యా చంద్రుడిపైకి లూనా-25 అంతరిక్ష నౌకను పంపింది. అన్ని అనుకున్నట్లు జరిగిే చంద్రయాన్-3 కన్నా ముందే లూనా-25 చంద్రుడి దక్షిణ ధృవంపై దిగి చరిత్ర సృష్టించేది. అయితే చంద్రుడి కక్ష్యలోకి చేరిన తర్వాత లూనా-25 రష్యాతో సంబంధాలు కోల్పోయింది. చివరకు చంద్రుడిపై కుప్పకూలింది.
Reasons Behind Luna-25 Crash: చంద్రుని దక్షిణ ధ్రువంపైకి చేరుకొని ఆ ఘనత సాధించిన తొలి దేశంగా రికార్డు క్రియేట్ చేయాలని భారత్ భావిస్తున్న తరుణంలో రష్యా దానికి బ్రేక్ వేయాలని చూసింది. హడావుడిగా లూనా-25ను చంద్రుని దక్షిణ ధ్రువంపై దింపాలని చూసింది. అయితే ఆ ప్రయత్నం కాస్తా బెడిసి కొట్టింది. 47 సంవత్సరాల తరువాత జాబిల్లిపై ప్రయోగం చేయడానికి రష్యా పూనుకుంది. ఇండియా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగాని కంటే ముందు తమ లూనా 25…
Chandrayaan 3 Postpone: చంద్రుని పై ప్రయోగం చేయడానికి రష్యా చేపట్టిన లూనా-25 కుప్పకూలిపోవడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం చంద్రయాన్ 3 వైపు చూస్తోంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అత్యంత కీలక దశలో ఉందని ఇస్రో తెలిపింది. రేపు చంద్రయాన్ 3 చందమామపై అడుగుపెడుతుందని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇస్రో ఓ కీలక ప్రకటన చేసింది. ఆ రోజు పరిస్థితులు అనుకూలిస్తేనే ఇస్రో ల్యాండింగ్‌కు ముందుకు వెళుతుందని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ల్యాండర్…
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై కీలక ప్రకటన చేసింది. చంద్రయాన్-3లో కీలకఘట్టం పూర్తి అయినట్లు ప్రకటించింది. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చివరి డీబూస్టింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు శనివారం అర్ధరాత్రి దాటాక ఇస్రో ప్రకటించింది.
దాదాపు 47 ఏళ్ల తర్వాత రష్యా చేపట్టిన మొట్టమొదటి మూన్ మిషన్ లూనా-25 అంతరిక్ష నౌక చంద్రుడిపై కూలిపోయింది. ల్యాండింగ్‌కు ముందు విన్యాసాల సమయంలో చంద్రునిపై అంతరిక్ష నౌక కూలిపోయిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ఆదివారం తెలిపింది.