CP CV Anand : మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై రౌండ్ టేబుల్ సమావేశం
- మతపరమైన ర్యాలీల్లో డీజే.. టపాసుల వాడకంపై రౌండ్ టేబుల్ సమావేశం
- హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన సమావేశం
- డీజే సౌండ్స్ ఈసారి శృతి మించాయన్న సీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకం పై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రాచకొండ సీపీ లు హాజరయ్యారు. వీరితో పాటు GHMC కమిషనర్ అమ్రాపాలి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాజసింగ్, MIM ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులు, మత సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. డీజే శబ్దాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, నివాసాల్లో వయసు మీరిన వారు ఇబ్బంది పడుతున్నారన్నారు.
Emergency Movie: కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ విడుదలకు మార్గం సుగమం.. కొన్ని సీన్స్ కట్
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
గుండె అదురుతోందని ఆందోళన చెందుతున్నారని, డీజే సౌండ్స్ ఈసారి శృతి మించాయన్నారు సీపీ సీవీ ఆనంద్. గణేష్ పండుగే కాదు.. మిలాద్ ఉన్ నబి లో డీజే నృత్యాలు విపరీతం అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. పబ్బుల్లో నృత్యాలు చేసినట్లే ర్యాలీల్లో చేస్తున్నారని, మాకు అనేక సంఘాలు వినతులు ఇచ్చారన్నారు. డీజే శబ్దాలు కట్టడి చేయాలని కోరారని, అందుకే పలు వర్గాలను పిలిచామని ఆయన వెల్లడించారు. అందరి అభిప్రాయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని, మా నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. డీజే శబ్దాల పై కంట్రోల్ లేకపోతే ఆరోగ్యాలు దెబ్బ తింటాయని, శబ్ద కాలుష్యంతో పర్యావరణానికి కూడా హానికరమన్నారు సీపీ సీవీ ఆనంద్.
IND vs BAN: బుమ్రా ఔట్.. అక్షర్ డౌటే! బంగ్లాతో రెండో టెస్టులో ఆడే భారత తుది జట్టు ఇదే
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!