తెలంగాణ కేడర్ కావాలని విజ్ఞప్తి చేసిన 11మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులకు కేంద్రం నో చెప్పింది. ఈ 11 మంది అధికారులు వెంటనే సొంత రాష్ట్రంలోనే రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డీఓపీటీ (DOPT) ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేస్తున్న ఆమ్రపాలి.. తనకు తెలంగాణ కేడర్ కావాలని కోరింది. దీనిపై సమీక్షించిన డీఓపీటీ.. తెలంగాణ కేడర్ ను కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) క్లిష్టమైన వ్యర్థాల నిర్వహణ సవాళ్లను పరిష్కరించడం ద్వారా నగర పరిశుభ్రతను పెంపొందించడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (SWM) కోసం అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) అభివృద్ధి ప్రయత్నాల్లో భాగంగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మంగళవారం ఆపరేటర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, అమలు చేయడానికి వినూత్న పరిష్కారాలను అన్వేషించింది. వ్యర్థాల నిర్వహణ కోసం ICCC కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ,…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బ్యానర్లపై కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి బ్యానర్లు అంటించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోస్టర్లు బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాల్ పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్ పై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్ జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. అంతేకాకుండా.. సినిమా థియేటర్ వాళ్ళు కూడ ఎక్కడా పోస్టర్లు అతికించకుండ చూడాలని డిప్యూటీ…
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకం పై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రాచకొండ సీపీ లు హాజరయ్యారు. వీరితో పాటు GHMC కమిషనర్ అమ్రాపాలి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాజసింగ్, MIM ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులు, మత సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ..…
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు పుల్ స్టాప్ కు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జంట కమిషనర్ల పరిధిలో సమన్వయ కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. 3 పోలీస్ కమిషనర్ల తో కలిపి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ట్రాఫిక్ తో పాటు ఇతరత్రా సమస్యలపై సమన్వయ కమిటీ చర్చించనుంది. ట్రాఫిక్ నియంత్రణ రోడ్ల అభివృద్ధిపై ప్రధానంగా కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా తోపాటు పోలీసు కమిషనర్లతో కమిటీ ఏర్పాటు రంగం…
రైతులకు, సైనికులకు కాంగ్రెస్ ద్రోహం చేసింది హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కురుక్షేత్రలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయమన్నారు. ఈ ర్యాలీలో సీఎం నయాబ్ సైనీపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. అలాగే భాజపా చెప్పింది.. కచ్చితంగా చేస్తుందని అన్నారు. రెండు రోజుల క్రితమే తాము హర్యానాకు ప్రయోజనం కలిగించే…
గణేష్ నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాటా తెలిపారు. ఈ నెల 17, 18, 19 మూడు రోజులపాటు 15000 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది పని చేస్తారని ఆమె తెలిపారు. శానిటేషన్ సిబ్బంది, ట్యాంక్ బండ్‌లో గజ ఈతగాళ్లు ను ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ట్యాంక్‌బండ్, సరూర్ నగర్ మంచినీళ్లు, ఫుడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు అమ్రపాలి తెలిపారు. ఇప్పటికే రోడ్ రిపేర్స్, స్ట్రీట్…
తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగియడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టారు. ఐఏఎస్ ఆఫీసర్ కాట ఆమ్రపాలి తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ అధికారుల కన్నా పవర్‌ఫుల్‌గా మారారు. తాజాగా చేపట్టిన బదిలీల్లో ఆమ్రపాలిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించారు.