భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే పేరు రోహిత్ శర్మ. ఒక సాధారణ క్రికెటర్ గా కెరీర్ ను ఆరంభించి.. టీమిండియా కెప్టెన్ గా ఎదిగిన రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. తన కెరీర్ లో ఎన్నో అవమానాలు దాటి టీమిండియాను నడిపించే స్థాయికి చేరుకున్నాడు. ఎంతో మంది అభిమానులను రోహిత్ సంపాదించుకున్నాడు.
Also Read : Kerala: పోకిరి ఏనుగు “అరికొంబన్” చిక్కింది.. అధికారుల ఆపరేషన్ సక్సెస్..
రోహిత్ ను అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. భారత్ లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్.. మాజీ సారథి ఎంఎస్ ధోని తర్వాత విరాట్ కోహ్లీతో సమానంగా అరదణపొందే ఏకైక ఆటగాడు మన హిట్ మ్యాన్. రోహిత్ శర్మ తన పేరిట ఎన్నో రికార్డులు లిఖించుకున్నాడు. ఒకే వన్డే వరల్డ్ కప్ లో 5 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్ కావడం విశేషం.
Also Read : CSK vs PBKS: దంచికొడుతున్న సీఎస్కే బ్యాటర్లు.. 10 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..?
ఇవాళ రోహిత్ శర్మ పుట్టిన రోజు కావడంతో దీంతో అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ తెలుపుతున్నారు. ఇక రోహిత్ పుట్టింది ముంబైలో అయినప్పటికీ హైదరాబాద్ లో మాత్రం ప్రత్యేకమై ణ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో ఐపీఎల్ ఆరంభ సీజన్ లో రోహిత్ శర్మ హైదరాబాద్ ఫ్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడాడు. 2009లో టైటిల్ గెలిచిన టీమ్ లో సభ్యుడిగా ఉన్నాడు.
Also Read : Mann ki Baat: ఏపీ రాజ్ భవన్ లో మన్ కీ బాత్ ప్రత్యేక ప్రదర్శన
ఈ క్రమంలో రోహిత్ శర్మ పుట్టిన రోజును హైదరాబాద్ లో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకంగా 60 అడుగుల రోహిత్ శర్మ కటౌట్ ను హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ లోని సుదర్శన్ థియేటర్ దగ్గర ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ కు కూడా ఇంత పెద్ద కటౌట్ పెట్టలేదు.