Tragedy: పెళ్లై ఏడాదైంది. భార్యను పుట్టింటినుంచి తీసుకుని ఇంటికి పయనమయ్యాడు యువకుడు. ఎంతో ఆనందంలో ముచ్చట్ల నడుమ బైకుపై సాగింది వారి ప్రయాణం. అలా సాగుతుండగా రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఈ లోకంతో మాకేం పని అన్నట్లు వారి ముచ్చట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్నట్లుండి ఊహించని పరిణామం.. కళ్లు తెరచి మూసే లోపే అంతా అయోమయం. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇద్దరు అప్పటివరకు చెట్టాపట్టాలేసుకుని బైకుపై కూర్చున్న వారిద్దరూ చెల్లా చెదురుగా పడి ఉన్నారు.
Read Also: King Fisher beers : కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదు.. 30కి.మీ పోతున్నాం
సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో పుట్టింటి నుంచి భార్యను తీసుకువస్తున్న ఓ యువకుడు మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఈ దారుణ ఘటన గోపాలపురం ఠాణా పరిధిలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి వైఎంసి సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ పడింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో ఓ ట్రావెల్స్ బస్సు శంషాబాద్ నుంచి మేడ్చల్ కు వెళ్తోంది. ఆ బస్సును మేడ్చల్ నివాసి అయిన మహేష్ నడుపుతున్నాడు. మితిమీరిన వేగంతో సిగ్నల్ పడింది గమనించుకోకుండా వాహనాలను.. ఢీ కొట్టుకుంటూ కొద్ది దూరం అలాగే వెళ్ళాడు. ఈ ఘటనలో సింగాయిపల్లికి చెందిన కొత్తపల్లి సందీప్ గౌడ్ బస్సు కిందపడ్డాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. టూ వీలర్ల పై ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సూరారం కాలనీకి చెందిన మరో వ్యక్తి వినయ్ ను.. ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Read Also: chai-chapati: చాయ్ చపాతీ కాంబినేషన్ హిట్.. తిన్నారంటే మీరు ఫట్
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బస్సు డ్రైవర్ మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో బస్సు దూసుకెల్లడంతో మూడు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి కారణం మితిమీరిన వేగం కాదని.. బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని డ్రైవర్ మహేష్ చెబుతున్నాడు