chai-chapati: చాయ్ చపాతీ కాంబినేషన్ హిట్.. తిన్నారంటే మీరు ఫట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
chai-chapati: టీ, చపాతీ భారతీయులకు ఇష్టమైన అల్పాహారం. కాబట్టి చాలా మంది చపాతీని బ్రేక్‌ఫాస్ట్‌లో టీతో పాటు తినేందుకు ఇష్టపడతారు. అయితే టీతో చపాతీలు తింటే ఆరోగ్యానికి చాలా నష్టం వాటిల్లుతుంది. టీ మరియు చపాతీ ఎందుకు అనారోగ్యకరమైన ఫుడ్ కాంబినేషన్ అని నిపుణులు సూచించారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో గ్యాస్, ఎసిడిటీ, రక్తం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
పరాటాలు, చపాతీలు మొదలైన భారీ ఆహారాలతో టీ తీసుకోవడం వల్ల కడుపులో తీవ్రమైన ఉబ్బరం.. యాసిడ్ రిఫ్లక్స్ ఏర్పడవచ్చు. ఎందుకంటే టీ లేదా కాఫీతో పరాటాలు లేదా చపాతీలు తినడం వల్ల కడుపులో యాసిడ్-బేస్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. టీలోని ఫినాలిక్ రసాయనాలు కడుపులో ఐరన్-కాంప్లెక్స్‌ల ఏర్పాటును ప్రేరేపిస్తాయి. ఇది శరీరంలో ఐరన్ శోషణను నిరోధిస్తుంది. అందువల్ల, టీని భోజనంతో పాటు తినకూడదు. ముఖ్యంగా ఐరన్ లోపం(రక్తహీనత) ఉన్నవారు.
Also Read
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
Read Also: TSPSC: టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ సెంటర్లో.. ఓఎంఆర్ షీట్ మింగిన అభ్యర్థి
టీలో టానిన్ అనే రసాయనం ఉంటుంది. చపాతీతో టీ తీసుకుంటే, అది శరీరంలో ప్రోటీన్ శోషణను అడ్డుకుంటుంది. ఇది ప్రొటీన్‌తో కలిసి శరీరంలో యాంటీన్యూట్రియెంట్‌గా పనిచేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, టానిన్ ప్రోటీన్ జీర్ణక్రియను సగటున 38% తగ్గిస్తుంది. టీ శరీరం పోషకాలను ఉపయోగించకుండా నిరోధిస్తుంది. కాబట్టి టీతో చపాతీ తీసుకోవడం మంచి కాదని డైటీషియన్స్ హెచ్చరిస్తున్నారు.
టీ ఎలా తీసుకోవాలి?
ఏదైనా ఆహారం తిన్నాక కనీసం 45 నిమిషాల తర్వాతే టీ తాగాలి. అల్పాహారం లేదా భోజనం తర్వాత ఒక గంట తర్వాత లేదా సాయంత్రం స్నాక్స్‌తో టీ తీసుకోవడం ఉత్తమం.
- Tags
- Chai
- Chapati
- Health
- Health Tips
తాజావార్తలు
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!