యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో కూలీల ఆటోను ప్రైవేట్ బస్ ఢీ కొట్టింది. అయితే.. ఈ ప్రమాదంలో పలువురు కూలీలకు గాయాలయ్యాయి. పలువురికి గాయాలవడంతో వారిని స్థానికులు వెంటనే హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read : Shahid Afridi: బీసీసీఐని కాదని ఐసీసీ ఏం చేయలేదు: షాహిద్ అఫ్రిదీ
మరో నలుగురికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది కూలీలు ఉన్నారు. మృతులు దేవులమ్మ నాగారం గ్రామానికి చెందిన సిలువేరు ధనమ్మ (30), వర్గాంతం అనసూయ (50), డాకోజి ధనమ్మ (25)గా గుర్తించారు. సీఐ మల్లికార్జున్ రెడ్డి, ఎస్సై సీతాపాండు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతులు పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో పనిస్తున్నారని పోలీసులు తెలిపారు.
Also Read : GVL Meeting with Kapu Leaders: కన్నా రాజీనామాను ముందు పసిగట్టిన బీజేపీ.. ఇలా ప్లాన్ చేసిన జీవీఎల్..!