GVL Meeting with Kapu Leaders: భారతీయ జనతా పార్టీకి షాక్ ఇస్తూ.. సీనియర్ నేత, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. పార్టీకి గుడ్‌బై చెప్పారు.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తన ముఖ్యఅనుచరుల సమావేశంలో ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు.. అయితే, కన్నా రాజీనామా ఎపిసోడును బీజేపీ ముందుగానే పసిగట్టినట్టుగా తెలుస్తోంది.. కన్నా రాజీనామా చేసిన రోజునే కాపు నేతలతో సమావేశాలు పెట్టుకున్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. బీజేపీ నుంచి కాపు ఫ్లేవర్ దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకే ఈ ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఇవాళ ఉదయం నుంచి ఎంపీ జీవీఎల్ తో కాపు నేతల వరుస భేటీలు జరుగుతున్నాయి.. దివంగత నేత వంగవీటి రంగా గురించి జాతీయ స్థాయిలో జీవీఎల్ ప్రస్తావించారంటూ కాపు నేతలు కితాబిస్తున్నారు..
Read Also: Big Breaking: బీజేపీకి బిగ్ షాక్.. పార్టీకి గుడ్‌బై చెప్పిన కన్నా..
ఇక, విజయవాడలో ఈ రోజు వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జీవీఎల్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంగా వ్యక్తిత్వం గురించి, బడుగు బలహీనవర్గాల సేవల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించాను అని గుర్తుచేసుకున్నారు.. భారతదేశ చరిత్రలో రంగా చరిత్ర అరుదైన సంఘటనగా పేర్కొన్న ఆయన.. 3 ఏళ్లలోనే 35 ఏళ్ల ఖ్యాతి సంపాదించారు రంగా అంటూ ప్రశంసలు కురిపించారు.. రాజకీయాలనేవి పార్టీలకు, కులాలకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇద్దరి పేర్లేనా.. మిగిలినవారి పేర్లు కనిపించవా..? అంటూ అటు అధికార పక్షం, ఇటు విపక్షంపై ఫైర్ అయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు..? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రతి పథకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలినవారి పేర్లు పెట్టరా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో అందర్ని గౌరవించుకోవాలని సూచించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
Read Also: Kanna Lakshminarayana: బీజేపీకి కన్నా లక్ష్మీనారాయ రాజీనామా..?
మరోవైపు, జీవీఎల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు కాపు నేతలు.. జీవీఎల్ పార్లమెంటులో రంగా గురించి ప్రస్తావన తేవడం ఆనందంగా ఉందన్నారు వంగవీటి నరేంద్ర.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగాకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.. జిల్లాకు పేరు పెట్టాలని మేం పోరాటం చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. రంగా పేరును ఓట్ల కోసం వాడుకుని పదవులు పొందారని విమర్శించిన ఆయన.. రంగా స్మారకంగా ఏమైనా చేద్దామనే ఆలోచన లేదు.. కానీ, జీవీఎల్ .. వంగవీటి రంగా గురించి తెలుసుకుని స్పందించడం గొప్ప విషయం అన్నారు. విజయవాడ విమానాశ్రయానికి రంగా పేరు పెట్టాలని కోరుతున్నాం.. జిల్లాకు కూడా రంగా పేరు పెట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మా ప్రయత్నం చేస్తామన్నారు. ఇదే సమయంలో.. కన్నా రాజీనామా చేయడంపై తరువాత మాట్లాడతాం అన్నారు వంగవీటి నరేంద్ర..
Read Also: Shikhar Dhawan: జట్టులో చోటు కోల్పోవడంపై ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇక, రాధా రంగా రాయల్ అసోసియేషన్ నేత గాదె బాలాజీ మాట్లాడుతూ.. రంగా పేరు జిల్లాకి పెట్టాలని కాపు నాయకులు ఎప్పుడూ అడగలేదని.. సీఎంను అడిగే ధైర్యం చేయలేదని విమర్శించారు. జీవీఎల్ ఇప్పుడు మాకు మద్దతుగా పార్లమెంట్లో అన్నారు.. రంగా నాడు అని ఒక బహిరంగ సభ విజయవాడలో పెడతాం అన్నారు. మరోవైపు రాధా రంగా రాయల్ అసోసియేషన్ హరికృష్ణ మాట్లాడుతూ.. జిల్లాల అంశం వచ్చినప్పుడు కృష్ణాజిల్లాకు రంగా పేరు పెట్టాలని అందరూ అంగీకరించారు.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సీఎం అంగీకరించలేదన్నారు.. రంగా పేరు పెట్టాలని అన్ని జిల్లాల్లో చేసిన కార్యక్రమాలకు స్పందన వచ్చిందని.. జీవీఎల్ ను అభినందించడంతో పాటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తాం.. రంగా అభిమానులు అందరూ ఒక దగ్గరకి చేరడానికి సీఎం జగన్ అవకాశం ఇచ్చారని వ్యాఖ్యానించారు. రంగా హత్య చేసిన వాళ్లు ఏ పార్టీలో ఉన్నా మాకు శాశ్వత శత్రువులే అని ప్రకటించారు హరికృష్ణ. మొత్తంగా.. కన్నా వెంట కాపు నేతలు మరో పార్టీలోకి వెళ్లకుండా.. బీజేపీ ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు.