Site icon NTV Telugu

RK Roja: పవన్ కళ్యాణ్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు..

Roja Rk

Roja Rk

సుపరిపాలన కాదు సుద్దు దండగా పాలన అని మాజీ మంత్రి ఆర్‌కే ఆరోజా అన్నారు. రూ.1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన? అని ప్రశ్నించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. “రూ. 81వేలకోట్లు ప్రజలకు ఎగనామం పెట్టడం సుపరిపాలన ? సూపర్ సిక్స్ అమలు చేయకపోవడమే సుపరిపాలన అంటారా? ఆడపిల్లను అత్యాచారాలు చేయడం చంపడం సుపరిపాలన ? రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ చేయడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం సుపరిపాలన అంటారా? సీబీఎన్ అంటేనే ఒక పెద్ద మోసం.. సి అంటెడ చీటింగ్‌‌… బి అంటే బాదుడే బాధుడు, ఎన్ అంటే నేరాలు‌.. అధికారికంలోకి రావడమే పెట్రోల్, డిజిల్, విద్యుత్ ఛార్జీలు పెంచారు… పొదలి లో జగన్ కొచ్చిన జన సునామిని చూసి భయపడి తల్లికి వందనం అమలు చేశారు. అమ్మ ఓడి పథకం చరిత్రలో నిలిచిపోతుంది… అందుకే మీరు అ పథకం అమలు చేస్తున్నారు.. జగన్ స్కూల్స్ అభివృద్ధి కోసం రెండు వేలు డబ్బు కట్ చేస్తే సైకో అన్నారు‌. ఇప్పుడు మిమ్మల్ని సైకో అనాలా సైతాన్ అనాలా? లోకేషా…జోకేషా….అని నవ్వకుంటున్నారు…” అని రోజా వ్యాఖ్యానించారు.

READ MORE: Jagtial: వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా.. 9 మందికి విద్యుత్ షాక్.. ఇద్దరి పరిస్థితి విషమం..

అనంతరం పవన్ కళ్యాణ్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎక్కడ చస్తే నాకేంటి అన్నట్టు పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు. తనకు ఫ్యాకేజీ, పవర్ ఉంటే చాలు అని పవన్ ఉన్నారని.. విద్యార్థులకు, రైతులకు ఇబ్బందులు పడుతున్న పవన్ నిద్రపోతున్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వానికి హానీమూన్ పిరిడ్ ముగిసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు… అధికారులు, వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. కూటమీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని.. రైతుల్లో కూడా కులాన్ని చూసి మోసం చేస్తున్న ప్రభుత్వం ఓటమి ప్రభుత్వమన్నారు. సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ ఏమయ్యాడో తెలియడం లేదని.. వరుసగా ఆలయాలు కూలిపోతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. చంద్రబాబు నూ ఎమ్మెల్యే, పోలిసులకు భయం లేదు.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మెడలు వచ్చేలా వైసీపీ పనిచేస్తుందని తెలిపారు. ఏడాది కాలంగా ఏమీ చేయకుండానే సూపర్ సిక్స్ అమలు చేశామని సిగ్గు లేకుండా అబద్దాలు చేబుతున్నారని మండిపడ్డారు.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నాలిక మడత పెట్టింది చంద్రబాబు అని ఆరోపించారు.

READ MORE: Pune Bridge Collapses: పూణేలో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు..

Exit mobile version