‘సూపర్ సిక్స్’ పేరుతో సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు.. మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్న హామీని కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్ -7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ నమ్మించారని…
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది.. పేదలను నాశనం చేయడానికే వైసీపీ పుట్టింది అని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతం కానీ.. గత ప్రభుత్వ హయాంలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు.
Minister Atchannaidu controversial comments on Super Six scheme: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. సూపర్ సిక్స్ సహా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో సమయం చూసి మరీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి తరుణంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో ఓ పథకంను అమలు…
చిత్తూరు జిల్లా పుంగనూరులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మోసం చేయడం చంద్రబాబు నైజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వచ్చిన ప్రజలను మోసం చేయడమే ఆయన నైజమని.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలో వచ్చిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారన్నారు.
ఏడాది కాలంలో కూటమి ప్రజలను వంచించిందని తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కు వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రసారమధ్యమల్లో తమ నాయకుడిపై విషాన్ని నింపడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు..
సుపరిపాలన కాదు సుద్దు దండగా పాలన అని మాజీ మంత్రి ఆర్‌కే ఆరోజా అన్నారు. రూ.1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన? అని ప్రశ్నించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. "రూ. 81వేలకోట్లు ప్రజలకు ఎగనామం పెట్టడం సుపరిపాలన ? సూపర్ సిక్స్ అమలు చేయకపోవడమే సుపరిపాలన అంటారా? ఆడపిల్లను అత్యాచారాలు చేయడం చంపడం సుపరిపాలన ? రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ చేయడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం సుపరిపాలన అంటారా? సీబీఎన్ అంటేనే…
AP Sub Cabinet : నేడు మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం జరగనుంది. ఈ సమావేశం సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా, అమరావతిరైల్వే లైన్ భూసేకరణ అంశం ఈ సమావేశంలో చర్చకు వస్తుంది. సిఆర్‌డిఏ భూ కేటాయింపులపై కూడా ఈ ఉపసంఘం చర్చించనుందని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా, త్వరలో భవనాల కోసం…