జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ షెడ్డులో ఉన్న వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విగ్రహానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో విగ్రహాన్ని తరలిస్తున్న యువకులు విద్యుదాఘాతానికి గురయ్యారు. కోరుట్ల శివారులో 33కేవీ విద్యుత్ తీగలు వినాయక విగ్రహనికి తగిలి 9 మందికి విద్యుత్ షాక్ కు గురయ్యారు. ఒక షెడ్డు నుంచి మరో షెడ్డు కు 13 ఫిట్ల విగ్రహాన్ని తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఊహించని ఈ ప్రమాదంతో అక్కడున్నవారంతా వణికిపోయారు. ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.
Also Read:Pune Bridge Collapses: పూణేలో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు..
షాక్ తగిలిన వారిలో పలువురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.