NTV Telugu Site icon

Revanth Reddy: ఎన్నికలు మొదలైనప్పటి నుండి బీఆర్ఎస్ డ్రామాలకు తెర లేపింది

Revanth

Revanth

బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రామారావు కుట్రల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కొత్త ప్రభాకర్ మీద దాడి జరిగితే.. గాయపడ్డ ప్రభాకర్ కంటే.. ముందే హరీష్ ఆసుపత్రికి వెళ్ళాడని రేవంత్ రెడ్డి అన్నారు. కత్తి పోట్లకు గురైన ప్రభాకర్ రెడ్డి నడుస్తూ కారెక్కాడు.. హరీష్ మాత్రం పరుగు పరుగున పరిగెత్తాడని విమర్శించారు. ఈ దాడి వెనక పీసీసీ బాద్యుడు అని కేసీఆర్ అన్నాడన్నారు. కానీ సీపీ మాత్రం.. దాడి వెనక కుట్ర లేదు.. సెన్సేషన్ కోసం దాడి చేశారని తెలిపారు. దాడికి పాల్పడిన ఐదుగురి రిమాండ్ రిపోర్టు బయట పెట్టాలని రేవంత్ కోరారు. కొత్త ప్రభాకర్ దాడి వెనక కుట్ర ఏందో బయట పెట్టాలని తెలిపారు. హరీష్ రావు.. పెట్రోల్ కొన్నాడు కానీ అగ్గిపెట్టే కొనలేదని విమర్శలు చేశారు.

Pakistan: పాక్ చెర నుంచి 80 మంది జాలర్ల విడుదల.. కుటుంబాలతో దీపావళి..

కొత్త ప్రభాకర్ పై దాడి చేసిన వ్యక్తి రాజు రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టడం లేదని రేవంత్ ప్రశ్నించారు. హరీష్ రావుకు.. దాడి చేసిన వ్యక్తికి మధ్య సంభాషణ ఉందా అని రేవంత్ అన్నారు. హరీష్ సన్నిహితులకు.. దాడి చేసిన వ్యక్తికి మధ్య ఏం సంభాషణ జరిగిందో బయట పెట్టాలని కోరారు. కేటీఆర్ ప్రకటనపై ఎన్నికల అధికారులు ఎందుకు సుమోటోగా కేసు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇంకో మూడు ఘటనలు జరుగుతాయి అని అంటుంటే కేసు పెట్టి.. విచారణ చేయాలని ఎన్నికల కమిషన్ ను కోరారు. ఇదిలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ దాడుల్లో గాయపడిన గువ్వల బాలరాజుపై మాట్లాడుతూ.. ఆయన కనిపించిన వాళ్ళ మీదల్లా దాడి చేస్తాడని తెలిపారు. గువ్వల బాలరాజు డబ్బులు పంచుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు.

Pakistan: పాక్ చెర నుంచి 80 మంది జాలర్ల విడుదల.. కుటుంబాలతో దీపావళి..

ఎన్నికలు మొదలయినప్పటి నుండి బీఆర్ఎస్ డ్రామాలు మొదలు పెట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ నుండి బీఆర్ఎస్ కుట్ర అనే డ్రామా మొదలు పెట్టారన్నారు. తెలంగాణలో మోడీ, కేసీఆర్, ఎంఐఎంలు అన్ని కలిసి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని రేవంత్ తెలిపారు. సానుభూతి కోసం కేటీఆర్, హరీష్ రావు కుట్రలు అనే నాటకం మొదలుపెట్టారన్నారు. ఈ పరిణామాలపై ఎన్నికల అధికారులు విచారణ చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. మరోవైపు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ నేతల డ్రామాలు నమ్మకండి.. దండుపాళ్యం ముఠా లాంటిది కేసీఆర్ కుటుంబం అని విమర్శలు చేశారు. వీళ్ళ నుండి ప్రజలు బయట పడాలి.. నాటకాలకు తెర దించాలని అన్నారు.

Show comments