బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రామారావు కుట్రల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కొత్త ప్రభాకర్ మీద దాడి జరిగితే.. గాయపడ్డ ప్రభాకర్ కంటే.. ముందే హరీష్ ఆసుపత్రికి వెళ్ళాడని రేవంత్ రెడ్డి అన్నారు. కత్తి పోట్లకు గురైన ప్రభాకర్ రెడ్డి నడుస్తూ కారెక్కాడు.. హరీష్ మాత్రం పరుగు పరుగున పరిగెత్తాడని విమర్శించారు. ఈ దాడి వెనక పీసీసీ బాద్యుడు అని కేసీఆర్ అన్నాడన్నారు. కానీ…