Vegetable Chips: బయట ఫుడ్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vegetable Chips: ఈ వర్షాకాలం సాయంత్రం కాస్త క్రిస్పీగా ఏదైనా తినాలి అనిపిస్తుంటుంది. బయట నుంచి ఏమైనా స్నాక్స్, ఫుడ్స్ తెచ్చుకుందామంటే.. ముందే వర్షాకాలం. ఎలాంటి నూనెలు వాడుతున్నారో, క్వాలిటీ ఎలా ఉందో అనే భయం మొదలవుతుంది. చిన్న పిల్లలకు బయట ఫుడ్స్ పెట్టాలంటే ఆ భయం కాస్త రెట్టింపు అవుతోంది. అందుకే ఇంట్లోనే కేవలం 30 నిమిషాల్లో క్రిస్పీగా, రుచిగా ఉండే వెజిటెబుల్ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎలాంటి నూనె వాడకుండా(జీరో ఆయిల్) చేసుకునే ఈ చిప్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి.
కావలసిన పదార్థాలు
* మీకిష్టమైన కూరగాయలు (బంగాళాదుంపలు, బీట్రూట్, క్యారెట్, జుకినీ, స్వీట్ పొటాటో మొదలైనవి)
* రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
తయారీ విధానం
ముందుగా మీరు తీసుకున్న కూరగాయలను వీలైనంత పల్చగా (సుమారు 1/6 ఇంచ్ మందంలో) స్లైస్ చేయండి. ముక్కలు సమానంగా రావడం కోసం మండోలిన్ స్లైసర్ (Mandoline Slicer) వాడటం మంచిది. బంగాళాదుంప ముక్కలను కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. బీట్రూట్ ముక్కలను 10 నిమిషాలు వేరే గిన్నెలోని నీటిలో నానబెట్టండి. ఇలా చేస్తే వీటి రంగు వేరే కూరగాయలకు అంటుకోకుండా ఉంటుంది. నానిన తర్వాత నీటిని పూర్తిగా వంపేసి, పొడి గుడ్డతో ముక్కలను తడి లేకుండా తుడుచుకోవాలి. క్యారెట్, జుకినీ వంటి కూరగాయలను నీటిలో నానబెట్టాల్సిన అవసరం లేదు. తడి లేని కూరగాయల ముక్కలను బేకింగ్ ట్రేపై ఒకదానికొకటి తగలకుండా పరచండి. ఇక, ఓవెన్‌ను 300°F (సుమారు 150°C) దగ్గర ప్రీ-హీట్ చేయండి. బేకింగ్ ట్రేపై పార్చ్మెంట్ పేపర్ లేదా సిలికాన్ మ్యాట్ వేసి పక్కన పెట్టుకోండి. వీటిని ఓవెన్లో పెట్టి 15 నిమిషాలు బేక్ చేయండి. తర్వాత ట్రే బయటకు తీసి, ముక్కలను జాగ్రత్తగా తిరగేసి (flip) మరో 15 నిమిషాలు బేక్ చేయండి. కొన్ని కూరగాయలు వేగంగా, మరికొన్ని కాస్త నిమ్మదిగా కాలవచ్చు. క్రిస్పీగా అవ్వని ముక్కలను మరో 5-10 నిమిషాల పాటు బేక్ చేయండి. ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత వాటిపై కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఈ చిప్స్‌ను తయారు చేసిన రోజే తింటే చాలా క్రిస్పీగా ఉంటాయి. మిగిలితే గాలి చొరబడని డబ్బాలో (Airtight Container) నిల్వ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..