టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొక్క చనిపోతే సర్పంచ్ని సస్పెండ్ చేస్తానని సీఎం అంటున్నాడని, మూసిలో 30 మంది కొట్టుకుపోయారు.. సీఎంని ఏం చేయాలి.. మహేశ్వరంలో ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఉన్నాయి.. మల్కాజిగిరిలో మూసిలో చిన్న పిల్లలు కొట్టుకుని పోయారు.. సీఎంని ఏం చేయాలి మరి అంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. మున్సిపల్ శాఖ మంత్రి చేతకాని తనం బయట పడిందని, తండ్రి.. కొడుకులను ట్యాంక్ బండ్ దగ్గర ఉరి వేసినా తప్పు లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతమే ఇవ్వడం లేదని, ఉద్యోగుల జీతాల కోసమే 3 వేల కోట్లు అప్పు చేశారు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి అని ఆయన వ్యాఖ్యానించారు. అధిక తెలివితో తన నెత్తిన తాను చేయి పెట్టుకున్నాడని, కేసీఆర్ కూడా అలాగే తయారు అయ్యారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
Also Read : Delhi Car Horror: మృతురాలు అంజలి ఇంట్లో దోపిడీ.. చేసింది ఫ్రెండ్ నిధినే!
తాను సచ్చిపోతు… సర్పంచులని కూడా సంపకు కేసీఆర్ అని ఆయన హితవు పలికారు. కేసీఆర్ని పొలిమేర్ల నుండి తరమండని ఆయన అన్నారు. సర్పంచుల హక్కులు కలరాసే చట్టాలు రద్దు చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ తెచ్చిన చట్టం రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నిధులు ఇస్తామని, సర్పంచులు తిరగపడండంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సర్పంచులు తలుచుకుంటే కేసీఆర్ని బొంద పెట్టొచ్చు.. ఇల్లు ఇల్లు తిరిగి ప్రజలకు కేసీఆర్ గురించి చెప్పండని, సర్పంచులు ఆత్మగౌరవంగా ఉండాలి అంటే… కేసీఆర్ ప్రభుత్వం పోవాలి అని ఆయన అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే.. కేసీఆర్ ఉద్యోగం ఉడటం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.