Theft reported at deceased Anjali Singh house family alleges friend Nidhi role: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ రోడ్డు ప్రమాదం ఘటనపై ఓవైపు విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు తాజాగా ఊహించని పరిణామం వెలుగుచూసింది. అమన్ విహార్‌లోని అంజలి ఇంట్లో దొంగతనం జరిగింది. కొందరు దుండగులు ఇంటి తాళం పగలగొట్టి.. ఇంట్లో ఉండే కొన్ని విలువైన వస్తువుల్ని పగలగొట్టి, మరికొన్నింటిని ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని పొరుగింటి వారు సోమవారం ఉదయం 7:30 గంటలకు అంజలి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న వాళ్లు, పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో టీవీతో పాటు కొన్ని విలువైన వస్తువులు పోయాయని అంజలి కుటుంబసభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ దోపిడీ వెనుక అంజలి ఫ్రెండ్ నిధి హస్తం ఉండొచ్చని వాళ్లు అనుమానం వ్యక్తం చేశారు.
IND vs SL ODI Series: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆటగాడు ఔట్?
నిజానికి.. వారం రోజుల నుంచి అంజలి ఇంటి వద్ద పోలీసులు భద్రతగా ఉన్నారు. కానీ, ఈ చోరీ జరిగినప్పుడు మాత్రం పోలీసులు అక్కడ లేరు. దీంతో, ఆరోజు పోలీసులు ఎందుకు అంజలి ఇంటి వద్ద లేరని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ చోరీ వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందన్న సందేహాలను వాళ్లు వ్యక్తం చేశారు. అయితే.. ఈ చోరీకి సంబంధించిన వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించాల్సి ఉంది. అంజలి కేసుపై ఇంకా విచారణ జరుగుతుండగానే, ఆమె ఇంట్లో చోరీ జరగడాన్ని బట్టి చూస్తుంటే, తెరవెనుక ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన తన స్నేహితురాలు నిధితో కలిసి స్కూటీలో వెళ్తుండగా, ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నిందితులు అంజలి మృతదేహాన్ని 12 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లారు. మద్యం మత్తులో ఉండటంతో వాళ్లు ఈ విషయాన్ని గ్రహించలేకపోయారు.
Supreme Court: మతమార్పిడి తీవ్రమైన సమస్య.. దీన్ని రాజకీయం చేయొద్దు
ఈ ప్రమాదం జరిగినప్పుడు.. అంజలి ఫ్రెండ్ నిధి ఆమెని కాపాడేందుకు ఎలాంటి సహాయం చేయకుండా, భయంతో అక్కడి నుంచి పారిపోయింది. దీంతో ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. ఈ ప్రమాదానికి కారకులైన ఐదుగురు నిందితుల్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తప్పుడు ఆధారాలతో వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిని సైతం అధికారులు అదుపులోకి తీసుకున్నారు.