Revanth Reddy : కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీలు ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ తమ పార్టీ మేనిఫెస్టోలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ధర్మపురిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన ప్రతీ అవినీతికి కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత అన్నారు. కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్లను కక్కిస్తామని, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇసుక మీద ప్రాజెక్టు కడతారా? అని ఆయన అన్నారు. కేసీఆర్‌ను కొరడాతో కొట్టినా తప్పులేదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ 200 ఎకరాల్లో వరి పండించి 1కోటి 80లక్షలు సంపాదించిండని, కేసీఆర్ వడ్లను కావేరీ సీడ్స్ కు క్వింటా రూ.4250 చొప్పున అమ్ముకుండన్నారు. కానీ తెలంగాణ రైతుల వడ్లను కేసీఆర్ ప్రభుత్వం క్వింటా రూ.2వేల చొప్పున కూడా కొనడం లేదన్నారు రేవంత్ రెడ్డి..
అంతేకాకుండా.. ‘కేసీఆర్ ఇదేనా రైతులపై నీకున్న ప్రేమ… ఇదేనా నువ్వు చెప్పే రైతు ప్రభుత్వం ? గెలిచినా ఓడినా.. లక్ష్మణ్ మీకు అండగా నిలబడ్డాడు.. మీకోసం పోరాటం చేశారు.. మీరు అభిమానంతో గెలిపించినా కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపి గెలుపు తమదని ప్రకటించుకున్నారు. మొరాయించిన ఈవీఎంలను మళ్లీ లెక్కించాలంటే కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నారు. కుట్రపూరితంగా కొప్పుల గెలిచినా ఈ ప్రాంతానికి ఆయన చేసిందేం లేదు.. కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాంతానికి నిధులు వచ్చాయి.. అభివృద్ధి జరిగింది. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన ప్రతీ అవినీతికి కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత. కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్లను కక్కిస్తాం.. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇసుక మీద ప్రాజెక్టు కడతారా? కేసీఆర్ను కోరడాతో కొట్టినా తప్పులేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి… కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది. తెలంగాణలో మార్పు కావాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. కేసీఆర్ 200 ఎకరాల్లో వరి పండించి. 1కోటి 80లక్షలు సంపాదించిండు. కేసీఆర్ వడ్లను కావేరీ సీడ్స్ కు క్వింటా రూ.4250 చొప్పున అమ్ముకుండు.. కానీ తెలంగాణ రైతుల వడ్లను కేసీఆర్ ప్రభుత్వం క్వింటా రూ.2వేల చొప్పున కూడా కొనడం లేదు. కేసీఆర్ ఇదేనా రైతులపై నీకున్న ప్రేమ… ఇదేనా నువ్వు చెప్పే రైతు ప్రభుత్వం?’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!