ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యే పనిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర స్ఫూర్తితో… తెలంగాణలో కాంగ్రెస్ నేతలు హాత్ సే హాత్ జోడో పేరిట పాదయాత్ర చేపట్టనున్నారు. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టబోయే ఈ యాత్రకు నేతలు, కార్యకర్తలు అంతా సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ యాత్ర ముందుగా భద్రాచలం నుంచి ప్రారంభించాలని అనుకున్నారు కానీ.. తాజా సమాచారం ప్రకారం.. ములుగు నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంపై ఆసక్తికరమైన చర్చ తెరపైకి వస్తోంది. నాడు వైఎస్ తరహాలోనే… నేడు రేవంత్ రెడ్డి కూడా… సెంటిమెంట్ ను నమ్మి ములుగు నుంచి నడవాలని నిర్ణయించుకున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం నుండి యాత్ర చేశారన్నారు. 2003 నాటి పరిస్థితులు.. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చిందని, కరెంటు కోతలు.. రైతు ఆత్మహత్యలు.. నిరుద్యోగ ఆత్మహత్యలు పెరిగాయి.. పొడుభూముల సమస్య అట్లనే ఉందని ఆయన అన్నారు. 2003 నాటి సంక్షోభం ఎదుర్కొంటున్నారు ప్రజలు అని ఆయన విమర్శించారు.
Also Read : R.V. Gurupadam: దక్షిణాది చిత్రసీమలో మరో విషాదం!
సీతక్క నియోజకవర్గం నుండి హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలిపారు. రాజులు.. రాజరికం మీద పోరాడిన స్ఫూర్తి సమ్మక్క..సారలమ్మ ఇచ్చారన్నారు. అదే స్ఫూర్తితో ప్రభుత్వ మీద పోరాటం చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్‌ఎస్.. బీజేపీ ఓకేతాను ముక్కలు అని, కాంగ్రెస్ ని దెబ్బతీయడానికి బీజేపీ.. బీఆర్‌ఎస్ నాటకాలు ఆడుతున్నట్లు ఆయన మండిపడ్డారు. నాటకాలకు ప్రగతి భవన్.. రాజ్ భవన్ వేదికగా నిలిచిందని, గవర్నర్ స్పీచ్ తో అలయ్ బలయ్ బయట పడిందననారు. వైద్యం బాగుంది అని స్పీచ్ లో చెప్పారని, నిమ్స్ కి వెళ్లిన గవర్నర్.. వైద్యం సరిగా లేదన్నారని గుర్తు చేశారు. ఎర్రెబెల్లి సొంత ఊరు వెళదామని, చింత మడక.. పోదాం.. ఇంటింటికి నీళ్లు ఇచ్చారా అనేది చూద్దామన్నారు. గవర్నర్.. కేసీఆర్ ని కాపాడే పనిలో పడ్డారని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : AP High Court: పోలీసులకు హైకోర్టు షాక్.. డిబేట్ ఎలా జరుగుతుందని నిలదీత
కేసీఆర్ అబద్దాలు కప్పిపుచ్చే పనిలో భాగంగా.. గవర్నర్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారన్నారు. బీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయ పార్టీ… కాంగ్రెస్ అని ఆయన అన్నారు. . బీజేపీ.. బీఆర్‌ఎస్ విధానాలు.. ప్రయోజనాలు ఒక్కటేనని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ కి క్యాట్ వాక్.. పబ్బుల గురించి మాట్లాడితే బాగుంటుందని, దేశం.. దేశ సమగ్రత ఆయనకు ఏం తెలుసునని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన చదివింది అంతా విదేశాల్లోనేనని, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కి ప్రతిదీ రాజకీయ ప్రయోజనమేనని, రాహుల్ గాంధీ దేశ ప్రయోజనం ముఖ్యమని, బీఆర్‌ఎస్‌కి ఇదే ఆఖరి బడ్జెట్ అని ఆయన విమర్శించారు. కేసీఆర్.. చివరిది అని ఈ అసెంబ్లీ కొడుక్కి అప్పగించినట్టు ఉన్నారన్నారు రేవంత్ రెడ్డి.