Nagababu Crucial Comments on Love Breakups and Separations: సినీ నటుడు, జనసేన కీలక నేత నాగబాబు బ్రేకప్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహకి ఇచ్చిన ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు మీ జనరేషన్లో చాలా అడ్జస్ట్ మెంట్లు ఉండేవి, ఒకరికకరు కాంప్రమైజ్ అవడం, అడ్జస్ట్ అవడం ఉండేవి, కానీ ఇప్పటి జనరేషన్లో వెంటవెంటనే రిలేషన్స్ బ్రేక్ అవడం, పెళ్లిళ్లు చేసుకుని సపరేట్ అయిపోవడం జరుగుతుంది దానికి కారణం ఏమై ఉంటుందని ప్రశ్నించారు. దానికి నాగబాబు సమాధానం ఇస్తూ ఇక్కడ మగవాడు ఒక మైండ్ సెట్ నుంచి పూర్తిగా డెవలప్ అవ్వలేదు, ఆడపిల్లలు ఏమో రెబల్ యాటిట్యూడ్స్ తో ఉంటున్నారని అన్నారు. చిన్నప్పటి నుంచి అమ్మలను వయసులో వేరే పెద్ద వారిని చూసి వీరు ఎందుకు అడ్జస్ట్ అవుతున్నారు? నేను ఎందుకు ఇలా అడ్జస్ట్ అవ్వాలని వాళ్లకు ఒక క్వశ్చన్ వస్తోంది అని అన్నారు.
ETV Prabhakar : మరొక అమ్మాయితో ఎఫైర్.. సీక్రెట్ బయటపెట్టిన ఈటీవీ ప్రభాకర్
అల్టిమేట్ గా ఏమిటంటే నేను సంపాదిస్తున్న, సమానంగా సంపాదిస్తున్న లేకుంటే నీ కన్నా కొంచెం ఎక్కువే సంపాదిస్తున్న, నీకన్నా ఎక్కువే చదువుకున్న, ఏదో పెళ్లి చేసుకున్నాం కదా అని నన్ను డామినేట్ చేసే, నా మీద అధికారం చెలాయించే హక్కు నీకు లేదు అని అమ్మయిలు ఫీల్ అవుతున్నారని అన్నారు. ఎప్పుడైతే ఒకరి మీద ఒకరు కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తే ముఖ్యంగా భార్యలను కంట్రోల్ చేయాలని చూస్తున్నప్పుడే ఇలాంటి బ్రేకప్స్ అవుతున్నాయని ఆయన కామెంట్ చేశారు. ఎందుకంటే నేను నీ కంట్రోల్ లో ఉండాల్సిన అవసరం నాకు లేదు, నేను ఇండిపెండెంట్ నాకు నేను సంపాదించుకుంటున్న కదా అని అమ్మాయిలు అనుకుంటున్నారని అన్నారు. పెళ్లి చేసుకున్నాం కాబట్టి సంతోషంగా కలిసి ఉందాం అంతే కానీ ఒక గిరిగీసి అందులోనే ఉండాలని చెప్పద్దు అన్నట్టు ఉన్నారని అన్నారు. ఎక్కువగా ఈ బ్రేకప్స్ కావడానికి కారణం మగవాడే అవుతాడని తన పర్సనల్ ఫీలింగ్ అని అన్నారు.