మంచిర్యాల సభకు తరలిరండని పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ సత్యగ్రహ సభను విజయవంతం చేయండన్నారు. ఈ నెల 14న రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఏఐసీసీ అగ్రనేత మన ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిపై బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా అక్రమ కేసులు నమోదు చేసి ఆ కేసులపై రెండేళ్ల జైలు శిక్ష పడేలా చేసి ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసి ఒక్క రోజు లోనే ఇంటిని సైతం ఖాళీ చేయించి ఒక భారీ కుట్రకు తెరలేపారన్నారు. అంతేకాకుండా.. ‘ దేశంలోని జాతీయ సంపదను ప్రజా ఆస్తులను ఆధానికి ధారాదత్తం చేసి అవినీతి కి పాల్పడుతున్న అంశాలపై రాహుల్ గాంధీ నిలదీయడం, ఆధాని అక్రమ సంపాదనలపై, హిండెన్ బర్గ్ నివేదికల ఆధారంగా జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలన్న డిమాండ్ చేస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ పై ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలకు పాల పడుతున్నారు.
Also Read : GVL Narasimha Rao: కేసీఆర్ కొత్త డ్రామాకి తెరలేపారు.. ఏపీని మోసం చేస్తున్నారు
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, రాహుల్ గాంధీకి మద్దతుగా, సిఎల్పీ భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రలో భాగంగా మంచిర్యాలలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సభకు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, ఏఐసీసీ సెక్రెటరీ ఇన్చార్జి తెలంగాణ శ్రీ మాణిక్ రావు ఠాక్రే లతో పాటు సీనియర్ నాయకులు అందరూ పాల్గొంటారు. ఈ బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృతనిశ్చయంతో పనిచేసి, ప్రజలను భాగస్వాములను చేసి సభ విజయవంతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, నాయకులు కార్యకర్తలు, జన సమీకరణ చేసి మంచిర్యాల కు తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read : Pawan Kalyan: విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి