వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేడు రిపోలింగ్ జరుగనుంది.
Also Read:Srushti Ivf Center : బయట పడుతున్న ‘సృష్టి’ లీలలు
అచ్చువేల్లి, కొత్తపల్లె గ్రామాల్లో రిపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అచ్చువేల్లి లో రెండు పోలింగ్ బూత్ లు ఉండగా మొదటి పోలింగ్ బూత్ లో రిపోలింగ్…492 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తపల్లె లోని రూమ్ నెంబర్ వన్ లో రిపోలింగ్…1273 మంది ఓటర్లు ఉన్నారు. ఇవాళ ఉదయం ఏడు నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నారు.