భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య సభలో రేణుకా చౌదరి మాట్లాడుతూ.. అన్నం పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ.. అనేక మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు, పక్క గృహాలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆమె తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన కూడలిలో ఈరోజు ఉదయం బూర్గంపాడు ఎస్సై జితేందర్ తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలం నుంచి సారపాక వైపుకు మోటారు సైకిల్‌పై ఒక బ్యాగ్‌తో వస్తున్న ఇద్దరిని అనుమానంతో పోలీసులు విచారించారు. వారి పేర్లను హేమల గంగి, సవలం నగేష్ అని చెప్పడంతో వారి వద్ద ఉన్న బ్యాగ్ ను తనిఖీ చేయగా వారి వద్ద పేలుడు పదార్థాలు ఉండటంతో వారి ఇరువురిని పోలీసులు అదుపులోకి…