Telangana employees: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. ఏపీకి చెందిన కొందరు ఉద్యోగులు తెలంగాణలో.. తెలంగాణకు చెందిన మరికొందరు ఉద్యోగులు.. ఆంధ్రప్రదేశ్‌లో విధుల్లో కొనసాగుతూనే ఉన్నారు.. అయితే, సొంత ప్రాంతానికి వెళ్లడానికి వాళ్లు ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.. తమను ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.. ప్రస్తుతం ఏపీలో 712 మంది స్థానికత ఉన్న ఉద్యోగులు పని చేస్తున్నట్టు వెల్లడించారు.. సచివాలయం, వివిధ హెచ్‌వోడీల కార్యాలయాలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని కోరుతున్నారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు. సీనియార్టీ కొల్పోయినా ఫర్వాలేదని.. తమను తమ రాష్ట్రానికి పంపాలని ప్రాధేయపడుతున్నారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైనా స్థానికత ఆధారంగా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై తెలంగాణ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. తమ విజ్ఞప్తులను పరిష్కరించాలని.. రెండు రాష్ట్రాల (ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి) సీఎంలను అభ్యర్థిస్తున్నారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో తమ అంశంపై చర్చించాలని కోరుతున్నారు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు.
Read Also: Pakistan: మోడీ పర్యటన ముందు పాక్‌కి రష్యా బంపర్ ఆఫర్.. అయినా ఆ దేశ దరిద్రం తెలిసిందే కదా..