TG Cabinet : రాష్ట్రంలో కొనసాగుతోన్న తెలంగాణ ప్రభుత్వం కీలక అభివృద్ధి, పరిపాలనా అంశాలపై చర్చించేందుకు జూన్ 5న కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలకు వేదికకానుంది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ సమావేశంలో విశ్లేషణ…
ఆగస్టు 15 తర్వాత ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తామని.. ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు. రైతు రుణ మాఫీ పూర్తైన వెంటనే ఆగస్టు 15 తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ ప్రకటిస్తామని వెల్లడించారు.
ఉద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్.. జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రను కొనియాడారు… అందరి కృషివల్లే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందున్న ఆయన.. గతంలో కరెంట్ సమస్య ఉండేదని.. ఆ సమస్య లేకుండా చేశామని గుర్తుచేశారు.. ఇక, ఉద్యోగులు చిన్న చిన్న సమస్యలకు బెంబేలెత్తిపోవద్దని సూచించారు ముఖ్యమంత్రి.. తెలంగాణ ఉద్యమ సమయంలో అండగా నిలిచిన ఉద్యోగులను…
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 317పై అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రభుత్వం జారీ చేసిన 317 ఉత్తర్వులతో ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం ఏర్పడిందన్న ఆయన.. ముఖ్యమంత్రి తుగ్లక్ పాలనకు ఇది నిదర్శనం అని మండిపడ్డారు. స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంలో ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. సీఎం కేసీఆర్.. సీనియర్, జూనియర్ పేరుతో ఉద్యోగుల్లో చీలిక తీసుకొస్తూ రాజకీయలబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని విమర్శించారు..…