ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బ్లాస్ట్ భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా కేంద్ర ప్రకటించింది. తాజాగా ఢిల్లీ ఉగ్రవాద పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ నలుగురు వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఢిల్లీ టెర్రర్ బ్లాస్ట్ కేసు దర్యాప్తు నేపథ్యంలో జమ్మూ & కాశ్మీర్ పోలీసుల నుండి వచ్చిన సమాచారం, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం, నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read:Nitish Kumar: విమర్శలు కాదు… నితీష్ కుమార్ విజయాలను చూడండి..
ఆరోపణలు, దర్యాప్తు వివరాలను పరిగణనలోకి తీసుకుని డాక్టర్ ముజాఫర్ అహ్మద్, డాక్టర్ అదీల్ అహ్మద్ రాదర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్ సయీద్ ల ఇండియన్ మెడికల్ రిజిస్ట్రీ (IMR), నేషనల్ మెడికల్ రిజిస్ట్రీ (NMR) లోని రిజిస్ట్రేషన్‌ను వెంటనే అమలులోకి వచ్చేలా రద్దు చేసినట్లు NMC ప్రకటించింది. అలాగే, ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్స్‌కు అధికారికంగా తెలియజేయనున్నట్లు కూడా NMC స్పష్టం చేసింది. ఈ పరిణామంతో, ఆయా వైద్యులు ఇకపై భారతదేశంలో వైద్య వృత్తిని నిర్వహించే అర్హత కోల్పోయినట్టే అవుతుంది. దర్యాప్తు పురోగతిలో ఇది ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు.