Hyderabad: ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసాలలో రంజాన్ ఒకటి. ఇస్లాంలో ఈ నెల చాలా ముఖ్యమైనది. ముస్లింలు ఉపవాసాలు, ప్రార్థనలు, సామూహిక భోజనాలు చేస్తూ నెల రోజులు గడుపుతారు.
విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన రియల్టర్ శ్రీనివాస్ కిడ్నాప్ ను పోలీసులు చేధించారు. అయితే ఈ వ్యవహారంపై నగర సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బాధితులు, నిందితులు పరిచయస్తులేనని ఆయన తెలిపారు. వీరికి విజయవాడలో పరిచయాలు ఉన్నాయని.. వీరు 2019లో విజయవాడలో ఎంకే కన్‌స్ట్రక్షన్స్ పేరిట వ్యాపారం నడిపారని త్రివిక్రమ్ వర్మ చెప్పారు.
హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా సీవీ ఆనంద్ ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్నారు. హైదరాబాద్ సీపీ ఉన్న అంజనీ కుమార్‌ను ఏసీబీ డీజీగా బదిలీ చేశారు. తెలంగాణలో 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌తో పాటు సీనియర్ ఐపీఎస్, వివిధ నగరాల కమీషనర్లను కూడా బదిలీ చేశారు. సిద్ధిపేట, నిజామాబాద్ పోలీస్ కమీషనర్లతో పాటు 11 జిల్లాల ఎస్పీలు కూడా బదిలీ…
మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తనపై అత్యాచారం చేశాడంటూ ట్రైనీ ఎస్సై ఆరోపించారు.. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డిపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీపీ తరుణ్ జోషి.. ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తనను ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి లైంగికంగా వేధించినట్లు అదే పీఎస్‌కు చెందిన మహిళా ట్రైనీ ఎస్సై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.. సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ పేరుతో ఒంటరిగా తనను…