సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరోసారి ఓటమి పాలైంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సునాయాస విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే.. ఈ సీజన్‌లో బెంగళూరు ఏడు మ్యాచులు ఆడింది. ఇందులో నాలుగు విజయాలు సాధించింది. విజయం సాధించిన ఈ నాలుగు మ్యాచ్‌లో బయటి స్టేడియాల్లోనే కావడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.