ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఢిల్లీ ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదు గెలిచింది. గుజరాత్ టైటాన్స్ కూడా 6 మ్యాచ్‌లు ఆడి నాలుగు గెలిచింది.
READ MORE: Chhattisgarh: దొంగతనం చేశారని.. కార్మికులకు విద్యుత్ షాక్, గోళ్లను ఊడపీకి పైశాచికం..
కాగా.. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 5 మ్యాచ్‌లు జరిగాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, గుజరాత్ టైటాన్స్ 2 మ్యాచ్‌లను కైవసం చేసుకుంది. గత సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి. రెండూ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఇప్పుడు ఎవరు గెలుస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
READ MORE: Viral Video: జిమ్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. చివరికి ఏమైందో చూడండి (వీడియో)
ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ XI
అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ఆశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్ కుల్‌దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేశ్ కుమార్
గుజరాత్ టైటాన్స్ టీమ్..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ