రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 9వ మ్యాచ్‌లో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను 50 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం. ఈ విజయంతో బెంగళూరు జట్టు 17 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సీఎస్‌కేని వారి సొంత మైదానంలో ఓడించింది. చెన్నై కంచు కోటను కూడా బద్దలు కొట్టగలిగింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అర్ధ సెంచరీతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది ఆర్సీబీ. లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.
READ MORE: Top Headlines @9AM : టాప్ న్యూస్
ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ స్టేడియంలో సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ స్టేడియంలో ఆర్సీబీకి చెత్త రికార్డుంది. 2008లో ఈ స్టేడియంలో మ్యాచ్ గెలిచిన కోహ్లి టీమ్.. ఆ తర్వాత 16 సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చెపాక్ స్టేడియం ఈ రెండు జట్లు 9 మ్యాచ్ లాడాయి. సీఎస్కే 8 గెలవగా.. ఆర్సీబీ ఒకటి మాత్రమే నెగ్గింది. ఇప్పుడు ఆర్సీబీ 17 ఏళ్ల చెత్త రికార్డును తాజాగా బద్దలు గొట్టింది. అయితే.. ఆర్సీబీకి కప్ రాకపోయిన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో చెత్త రికార్డు బద్దలు కావడంతో అభిమానుల ఉత్సాహం తారా స్థాయికి చేరుకుంది. ఈ సారి కప్పు ఖాయమంటూ ఎగిరి గంతేస్తున్నారు అభిమానులు..
READ MORE: Minister Narayana: గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి.. కోట్లు అప్పు మిగిల్చింది!