బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘క్రిష్’ సిరీస్ సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ లో భాగంగా వచ్చిన ‘కోయి మిల్ గయా’, ‘క్రిష్’ మరియు ‘క్రిష్ 3’ లు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. క్రిష్ సిరీస్ కు హిందీలోనే కాదు టాలీవుడ్ లోను సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సూపర్ హీరో కథతో తెరకెక్కిన ఈ క్రిష్ సిరీస్ మూడు సినిమాలు రాగ క్రిష్ 4 ఎప్పుడు వస్తుందా అని హృతిక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అందుకు సంబందించి ఓ గుడ్ న్యూస్ ఇచ్చాడు హృతిక్ . ‘క్రిష్ 4’ తెరకెక్కబోతుందని గతంలో తెలిపాడు హృతిక్. కానీ ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే దానిపై తర్జన భర్జనలు నడిచాయి. మొత్తానికి క్రిష్ 4 కు డైరక్టర్ ఎవరనేది ప్రకటించారు. మొదటి మూడు సినిమాలకు దర్శకత్వం వచించిన హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ క్రిష్ 4 బాధ్యతల నుండి తప్పుకున్నాడు. గత కొన్నాళ్లుగా బాలీవుడ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పేరు వినిపించింది. అయితే వాటన్నిటికి తెరదించుతు క్రిష్ 4 కు చిత్ర హీరో హృతిక్ రోషన్ దర్శకత్వం వహించబోతున్నాడు అని ఆయన తండ్రి రాకేష్ రోషన్ వెల్లడించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ వార్ -2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వార్ 2 సినిమా తర్వాత క్రిష్ 4 ను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు హృతిక్. హీరోగా స్టార్ స్టేటస్ అందుకున్న హృతిక్ దర్శకుడిగా కూడా స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.