Komatireddy Venkat Reddy : ఆర్ & బీ శాఖలో ఏఈఈల ఆరేళ్ల నిరీక్షణకు తెరదించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఒకే రోజు 118 మంది ఏఈఈ లకు డీఈఈ లుగా పదోన్నత లభించింది. దీంతో ఆర్ & బీ లో ఏఈఈ లు సంతోషంలో మునిగిపోయారు. డీపీసీ ప్యానల్ నిబంధనల మేరకు 118 మందికి పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. ఏఈఈల ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సాఫీగా ప్రమోషన్లు ఇచ్చేలా స్వయంగా ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. గత ప్రభుత్వంలో చెప్పులరిగేలా తిరిగినప్పటికి మమ్మల్ని పట్టించుకోలేదని ఆవేదనలో ఏఈఈ లు ఉండగా.. కలిసిన ప్రతీసారి మా సమస్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సావధానంగా విన్నరని ఏఈఈ లు తెలిపారు. ప్రత్యేకంగా ఫైలు తెప్పించుకొని పరిశీలించి ఏఈఈ లకు మంత్రి కోమటిరెడ్డి న్యాయం చేసినట్లు వారు తెలిపారు.
ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా సర్వీసు రూల్స్ అమలు అయ్యేలా కృషి చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కళ్లు కాయలు కాసేలా ప్రమోషన్ల కోసం చూసామని.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృషితోనే మాకు ప్రమోషన్లు దక్కాయని సంబురంలో ఏఈఈలు ఉన్నారు. ప్రభుత్వం అంటే పనిచేసుకునేది మాత్రమే కాదు, ఉద్యోగుల శ్రమకు విలువనిచ్చేదికూడా అనే మాటను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతల్లో చూపించాడన్న ఏఈఈలు వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రుణపడి ఉంటామని పదోన్నతి పొందిన ఏఈఈ లు అన్నారు. త్వరలోనే డీఈఈ లుగా పదోన్నతి పొందినవారికి పోస్టింగులు ఇవ్వనుంది ప్రభుత్వం. ఆర్ & బీ లో అమలు చేస్తున్న సర్వీసు రూల్స్ అమలు ఆదర్శమన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. డిపార్ట్ మెంట్ చరిత్రలో సంచలన ప్రమోషన్లన్న ఆర్ & బీ ఉద్యోగులు తెలిపారు.
Pawan Kalyan: బడ్జెట్‌పై పవన్‌కల్యాణ్ ప్రశంసలు.. వికసిత్ భారత్‌కు తోడ్పడుతుందని వ్యాఖ్య