ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌ను ఘోరాతి ఘోరంగా ఓడించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విజయం తర్వాత రషీద్ ఖాన్ ఇండియా ఫ్లాగ్ పట్టుకుని తిరిగాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. రషీద్ ఖాన్ భారత జెండాను పట్టుకుని తిరిగినందుకు ICC రూ. 55 లక్షల జరిమానా విధించింది. దీంతో రషీద్ ఖాన్‌కు భారత పారిశ్రామికవేత్త రతన్ టాటా రూ.10 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది.
Read Also: Katrina Kaif: ప్రపంచంలోనే బెస్ట్ యాక్షన్ టీమ్ తో కలిసి పని చేశాను
ఈ విషయంపై రతన్ టాటా స్పందించారు. రషీద్ ఖాన్‌పై తాను ఎలాంటి రివార్డును ప్రకటించలేదని.. అదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఏ ఆటగాడికి సంబంధించిన సలహాలు లేదా ఫిర్యాదుల విషయంలో నేను ఐసీసీకి ఎలాంటి సలహా ఇవ్వలేదని రతన్ టాటా తన ట్వీట్లో రాశారు. ఇంకా క్రికెట్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదని రాశాడు. అయితే రతన్ టాటా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రతన్ టాటా పోస్ట్‌పై నెటిజన్లు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.
Read Also: Kishan Reddy: హామీలు ఇవ్వడం, మభ్యపెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య
https://twitter.com/RNTata2000/status/1718854586734371181