Katrina Kaif: ప్రపంచంలోనే బెస్ట్ యాక్షన్ టీమ్ తో కలిసి పని చేశాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Katrina Kaif: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ 3. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా దీన్ని నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జోయా పాత్రలో కత్రినా కనిపిస్తారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 12న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆదిత్య చోప్రా రూపొందిస్తోన్న స్పై యూనివర్స్‌లో తొలి లేడీ స్పై జోయా పాత్రలో కత్రీనా నటిస్తోంది. టైగర్ ఫ్రాంచైజీ మొదలైనప్పటి నుంచి ఈ పాత్రను మనం చూస్తున్నాం. హీరో పాత్రకు ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దారు. జోయా విషయానికి వస్తే శత్రువులను చూస్తే భయపడదు. వారిపై భయకరంగా ఎదురు దాడిని చేస్తుంది. అంతే కాదండోయ్ చాలా తెలివైనది కూడా. ఇక ఆమె యాక్షన్‌లోకి దిగితే ఆమెతో ఎవరూ సరితూగలేరు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కత్రీనా యాక్షన్ సీన్స్ అదరగొట్టింది. ఇక ఈ పాత్ర గురించి కత్రీనా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.
కత్రినా కైఫ్ మాట్లాడుతూ “తన దేశాన్ని లేదా కుటుంబాన్ని, మానవత్వాన్ని కాపాడే సందర్భాల్లో ఓ మహిళ ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతుందని టైగర్ 3లో చూపించాం. నా కెరీర్‌లో నేను చేసిన పాత్రలో జోయా పాత్ర చాలా పవర్‌ఫుల్. అమ్మాయిలు లేదా మహిళలు ఈ సమాజానికి శక్తివంతమైన రక్షకులుగా వ్యవహరిస్తుంటారు. జోయా పాత్ర ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగిపోతుంది. ఆమెకు ధీటుగా అలాంటి పాత్రను మనం చూడలేం. యుద్ధం చేయాల్సిన సందర్భంలో ఆమె వెనుకడుగు వేయదు. ఆ విషయంలో మగవాళ్ల కంటే గొప్పగా ఆమె పోరాటం చేస్తుంది. జోయా స్టైల్ ఆఫ్ యాక్షన్ యూనిక్‌గా ఉంటుంది. ట్రైలర్‌లో చూపించిన విధంగా క్లిష్టమైన యాక్షన్ సీన్స్‌లోనూ జోయా ఎలాంటి ఇబ్బంది లేకుండా నటిస్తుంది. ఆమె ఒంటరిగా వందలాది శత్రువులతో పోరాడటాన్ని మనం వెండితెరపై చూడొచ్చు. యష్ రాజ్ ఫిలిమ్స్ నా పాత్రను ప్రతీ సినిమాలో చాలా గొప్పగా చూపించారు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇక ఇలాంటి స్పై చిత్రంలో యాక్షన్ సీక్వెన్సుల్లో నటించటంతో నా కల నేరవేరినట్లుగా ఉంది. ఈ ఫ్రాంచైజీలో నేను వందకు రెండు వందల శాతం న్యాయం చేయటానికి ప్రయత్నించాను. టైగర్ ఫ్రాంచైజీలో జోయా పాత్ర నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో నటించటానికి రెండు నెలల పాటు శిక్షణను తీసుకున్నాను. అందుకు కారణం జోయా పాత్ర మరింత వేగంగా, బలంగా కనిపించాలనేదే. దాని కోసం చాలా కష్టపడ్డాను. నా కెరీర్‌లోనే ఇది కఠినమైన ట్రైనింగ్. నేను చేసిన యాక్షన్ సన్నివేశాలను చూసినప్పుడు మరెవ్వరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదనిపిస్తుంది. ప్రపంచంలోనే బెస్ట్ యాక్షన్ టీమ్‌తోకలిసి పని చేశాను. ఈ యాక్షన్ సన్నివేశాలను వెండి తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనే చూడాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అని చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమా కత్రీనాకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!